దేవుడు ఎంత పక్షపాతి
లేనివాడికి ఇంట్లోకి కూడా ఇవ్వడు
ఉన్నోడికి వొంట్లోకి కుడా ఇస్తాడు
.................షుగరు
ఎన్ని చేపల ఏడుపో..
...........................
సముద్రం లో ని ఉప్పు.
ఒకటే చూసే రెండు కళ్ళు
ఒకదానికి ఒకటి చూస్కోవు
ఎప్పుడు కలిసి ఉండే రెండు పెదాలు
ఒక్క మాట తో విడిపోతాయి
అందుకే..
కళ్ళకి ధ్యానం కావాలి,
పెదాలకి మౌనం కావాలి.
మా ఇంటి చుట్టూ apartments వారికి
కనబడ కూడనివి కనపడుతున్నాయి
మాకు కనపడాల్సిన సూర్యచంద్రులు
కనపడటం మానేశారు...
కుటుంబనియంత్రణ
ఒకరు లేక ఇద్దరు,,,,
...............................
పిల్లలా????? పెళ్ళాలా ???
వీడియోలు తీయాల్సింది
పెళ్లిళ్లకు,పుట్టిన రోజులకు కాదు
సిజేరియన్ లకు
అది చూసైనా కన్నతల్లి కడుపుకోత
తిరగబడే బిడ్డలకు తెలియాలి..
ఒక్క మగాడి హత్య కు
వంద కారణాలు,
వంద ఆడవాళ్ళ హత్యలకు
"కట్నం" ఒక్కటే కారణం..
చాలా బాగున్నాయ్యండి ...సింప్లి సూపర్బ్....
ReplyDelete