హుండీలో వేస్తానని
తిరుపతి వెంకన్నకు మొక్కుకున్నాడు.
ఆడపిల్ల పుట్టింది.
ఆనందం లో మొక్కు మరిచాడు
అమ్మాయి పెళ్లికు
వడ్డీతో సహా శ్రీనివాస రావు పేరుతొ
అల్లుడి రూపం లో పట్టుకెళ్ళాడు...
చిన్నప్పుడు రోగం వస్తే నాన్నారు
"ఆ మెడకు" తయాట్టు కట్టారు,,,
స్కూల్ లో రాంక్ వస్తే మాష్టారు
"ఆ మెడకు" గోల్డ్ మెడల్ వేసారు.,,
కావలసిన కట్నం ఇచ్చాక మొగుడు
"ఆ మెడకు" తాళి కట్టాడు,,
ఇంతమందికి నచ్చిన "ఆ మెడకే"
అత్తగారు ఉరేసింది,,,,,,,
మానభంగానికి శిక్ష
......ఏడేళ్ళు అట
నిజమే
న్యాయశాస్త్రాన్ని రాసింది
........మగాడే గా
పడుకున్న మా పాప చేతి లో
కుక్క బొమ్మ ఉన్నది,,
ఆ బొమ్మ కల్లెప్పుడూ
నాకేసి ప్రశ్న వేస్తుంటాయి,,
తనలా నేనెందుకు
దగ్గర కాలేక పోతున్నాను అని,,,
వాడి చిన్నతనం లో
"ఊరికే" ఆడుతుంటే
తండ్రిగా తెగ ఫీల్ అయ్యేవాడిని,,
నా ముసలితనం లో
ఇంకా "ఊపిరి" ఆడుతుంటే
బిడ్డగా వాడు ఫీలవుతున్నాడు,,, మా ఆవిడ పురిటి నొప్పులు చూసాక
ఇక ఆవిడను ఇబ్బంది పెట్టదలచుకోలేదు,,,
.........................................
రెండో పెళ్లి చేసుకున్నాను!!!!!!!!!!
నా దేహానికి చొక్కాలు
నా పాదానికి చెప్పులు
ఏమి వేసినా పదిమంది
మేచ్చుకోవాలనే దురద..
అదేమీ చిత్రమో
నాకెప్పుడూ ఈ బట్టలు నేసినవాడిని,
ఈ చెప్పులు కుట్టినవాడిని ,,
కలిసి మెచ్చుకోవాలి అని అనిపించదు?????????
చాలా రోజులక్రితం చదివాను జనార్ధన మహర్షి గారి " వెన్న ముద్దలు " పుస్తకం.. మళ్లీ గుర్తుచేసినందుకు థాంక్స్ అక్క.. ఆ పుస్తకంలో నాకు ఒకటి గుర్తుంది..
ReplyDeleteకడుపులో బిడ్డ
తిరగబడ్డాడు
పెద్దాపరేషన్
కోలుకోవటానికి
రెండేళ్ళు పట్టింది
ఇరవై రెండేళ్ళ తర్వాత
మళ్ళీ తిరగబడ్డాడు
ఇంకేం కోలుకుంటుంది..