Nov 16, 2009

బ్లాగ్ అంటే

ఈ మధ్య టపాలు రాసి చాలా రోజులు అయింది లెండి.. కొద్దిగా పెళ్లి పనుల్లో తీరిక లేకపోయింది....
నా స్నేహితురాలు నా బ్లాగ్ చూసి ఏమిటే అప్పుడే అంత పెద్దదానివి అయినావా messagelu ఇస్తున్నావ్ సంస్కర్త లాగా అని అన్నది...బ్లాగ్ అంటే ఏదో సరదా కు చదువుకునేదే... అందులో కుడా నువ్వు సీరియస్ మెసేజెస్ ఇస్తే ఎలాగే ,, చదివే వారికీ బోర్ కొడుతుంది అని అన్నది...సరే కదా అని ఒక సారి పాత టపాలు అన్ని తీరిగ్గా చదివాను... నాకే ఆశ్చర్యం వేసింది నా లైఫ్ లోనే ఇన్ని సంఘటనలు జరిగాయా అని... నా ఉద్దేశ్యం లో బ్లాగ్ అంటే సరదా ఉండాలి కొద్దిగా చదివిన వారికీ లేదా జనాలకు ఉపయోగ పడాలి.. అది మన చుట్టూ జరిగిన సంఘటనలు తెలుసుకున్న చాలు... అని చిన్న సైజు క్లాసు పీకాలెండి...సో మీరు కూడా బ్లాగ్ అంటే ఎలా ఉండాలో ఎమైన సలహాలు ఇస్తారేమో అని ఆశిస్తున్నాను...

2 comments:

  1. బ్లాగ్ అంటే మన మనసు కి ప్రతిబింబం ....ఏదో సినిమాలో వెంకటేష్ చెప్పినట్టు కలెక్టర్ అంటే .....కలెక్టర్ అంతా కాకపోఇన ఏదో క్లర్కు లాగ చిన్న జాబు ఏదో .....అంటు నసిగేసి నట్టు.....మనసుకి ప్రతిబింబం కాకపోయినా చాల వరకు మన రుచులను తెలిపేదిగా ఉంటే బాగుంటుంది. మంచి టాపిక్ మొదలు పెట్టారు.

    ReplyDelete
  2. చాలా బాగా చెప్పారు. బ్లాగు అంటే మొదట మన ఆనందం కోసం మొదలు పెట్టాలి. తరువాత అది నలుగురికీ ఆనందం కలిగించేదిగా ఉండాలి. ఆ ఆనందంతో పాటు కొంత మంచిని పెంచేదిగా/పంచేదిగా ( మంచి సందేశాన్నిచ్చేదిగా ) ఉంటే అది కలకాలం నిలుస్తుంది. అలాగే ఆనందం అని చెప్పి అది చదువరుల చెడును పెంచేదిగాఉంటే అది త్వరలోనే ఆదరణ కోల్పోతుంది.

    అంటే ఆనందం ఉండాలి. ఆ ఆనందం కొంత ఉపదేశంతో కూడితే ఉత్తమమైన రచన. చెడుత్రోవలో ( నాసి రకమైన శృంగారపు మాటలతో, పరుల దూషణలతో ) వెళితే అది అధమం. ఎటూ వెళ్లక కేవల ఆనందానికే పరిమితమైతే అది మధ్యమం.

    సందేశలు అంటే ఒకటి గుర్తుంచుకోవాలి. ఎవ్వరూ ఎప్పుడూ మన సందేశాలకు వెంటనే మారిపోరు. కానీ కొంత ఆలోచిస్తారు. ఆ ఆలోచన కాలక్రమేణా వారిలో కొత మార్పు తీసుకు రావచ్చు. ఇక ఆనందం లేని సందేశాలు జనాలకు ఎక్కవు. సరదగా, ఆహ్లాదంగా ఉంటూ అవకాశం ఉన్నచోట చెప్పీ చెప్పకుండా చిన్న సందేశం ఇవ్వాలి.

    ఏదైనా సందేశాత్మకమైన ఆనందానికే నా మొదటి ప్రాధాన్యం. నాబ్లాగును చూసి ఎంత వరకూ కృతకృత్యుడనయ్యానో మీరే చెప్పాలి. :)

    ReplyDelete