Dec 27, 2011

దక్షిణ

పూజలు,వ్రతాలూ  చేసినప్పుడు తాంబూలం ఇచ్చేటప్పుడు మనం అందులో దక్షిణ పెడతాం.దక్షిణ అనేది బ్రాహ్మణుని కోసమే ,ఆయనే తీసుకోవటానికి  దక్షిణ అని పేరు చెప్పి మన దగ్గర వసూలు చేస్తారేమో అని అనుకున్నాను  నేను ,,కానీ ఈ మధ్యనే  దేవి భాగవతం లో చదివేటప్పటికి తెలిసింది,,దక్షిణ అనేది కూడా ఒక దేవత రూపమే అని,దక్షిణ లేని పూజ ఫలించదని ,,ఆ కధా మీరు కూడా చదవండి,,,


పూర్వము గోలోకము లో సుశీల అనే గోపిక ఉన్నది.ఆమె  శ్రీహరి కి అత్యంత ప్రియురాలు.రాధ కు స్నేహితురాలు.విద్యా గుణవతి అయిన యువతి.ఒకనాడు ఆ సుశీల రాధ చూచుచుండగా  శ్రీకృష్ణుని ఎడమ భాగమున నిలుచుండెను.అప్పుడు గోపికలందరిలో అందెవేసిన చేయి అయిన రాధ తన ఎదురుగ ఉండుట చూసి శ్రీకృష్ణుడు భయముతో తల వంచుకొనెను.రాధ ఆ దృశ్యము చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది..అది చూసి శ్రీ కృష్ణుడు అంతర్ధానం అయ్యాడు.శ్రీకృష్ణుడు అంతర్ధానం అవటం చూసి సుశీల,మిగత గోపికలు భయపడిపోయారు.వారందరూ కృష్ణున్ని ప్రార్ధించారు..సుశీల పారిపోయింది,,సుశీల పారిపోవుట,శ్రీకృష్ణుడు కనిపించక పోవుట తెలుసుకొని రాధ సుశీల ను శపించింది,,ఇక నుండి గోలోకము లో కాలు పెట్టరాదు,పెట్టిన భస్మము అవుదువు గాక అని.రాధ శ్రీ కృష్ణుని దర్శనము ఇమ్మని ప్రార్ధించింది,,కాని శ్రీకృష్ణుడు రాధ ముందు కనిపించలేదు.
చాలా సంవత్సరాలు సుశీల తపస్సు చేసి లక్ష్మి దేవి శరీరము లో ప్రవేశించినది.
తరువాత దేవతల అందరూ అనేక యజ్ఞములు చేసారు.కనీ వారు ఆ యజ్ఞముల ఫలమును అనుభవింప లేకుండిరి.అప్పుడు వారు అందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్లి మొర పెట్టుకున్నారు.బ్రహ్మ కొంత కాలము తన మనస్సులో విష్ణు మూర్తి ని ధ్యానించి సమాధానము పొందారు.దాని ఫలితము గా నారాయణుడు మహాలక్ష్మి శరీరము నుండి ఒక దేవి పుట్టించి ఆమెను బ్రహ్మ కు సమర్పించారు.ఆ దేవి లక్ష్మి కు దక్షిణ భాగము నుండి జనించుట చే ఆమెకు దక్షిణ అనే పేరు వచ్చింది. యజ్ఞ భావనుడు దక్షిణ ను తన భార్య గా చేసుకొనెను.దక్షిణ పన్నెండు సంవత్సరాలు గర్భము ధరించి ఒక పుత్రుని కనెను అతని పేరు "ఫలము" .ఈతడు కర్మలను సక్రమముగా పూర్తి చేసిన వారికీ ఫలములను ఇచ్చును.యజ్ఞుడు,దక్షిణా పత్నితో పుత్రఫలముతో కర్మిష్టు లకు ఫలము ఒసగుచుండును.అప్పుడు దేవతలు అందరూ సంతోషించి తమ తమ నివాసములకు వెళ్లారు.
కర్త అగు వాడు తన కార్యము పూర్తి అయిన వెంటనే బ్రాహ్మణులకు దక్షిణ ఈయవలెను.అప్పటికప్పుడే కర్త కు ఫలము సిద్దిస్తుంది.దక్షిణ ఈయనిచో చేసిన పుణ్యము అంతయు బూడిద లో పోసిన పన్నీరు అగును..

Dec 11, 2011

మనసున్న మారాజు

సమయము సాయంత్రం అయిదు గంటలు.పార్కు లో అటు ఇటు అసహనం గా తిరుగుతూ ఉన్నాడు శ్రీను.ఇంత సేపా ఎప్పుడనగా వస్తానన్నావ్ అంటూ చిందులు తొక్కాడు అప్పుడే అక్కడకు వచ్చిన దీప్తి తో....దీప్తి,శ్రీను లకు ఒకరంటే ఒకరికి ప్రేమ..రెండు రోజుల క్రితమే పెళ్లి ప్రస్తావన తెచ్చాడు  శ్రీను..ఆలోచించుకుని అభిప్రాయము చెప్పమని సమయం కూడా ఇచ్చాడు దీప్తి కు ..
ఇంతకీ ఏమని నిర్ణయించుకున్నావ్..ఇంట్లో వాళ్ల అనుమతి తో చేసుకుందామని నా లేక ఎక్కడి కైనా వెళ్ళిపోయి చేసుకుందామా ,అని సూటి గా ప్రశ్నించాడు శ్రీను . ప్లీజ్
ఇంకా ఎవరినైనా పెళ్లి చేసుకొని హ్యాపీ గా ఉండు,,మనం మంచి స్నేహితులు గానే ఉందాం,,మన పెళ్లి మీ పెద్దలు,మా పెద్దలు ఇద్దరు ఒప్పుకోరు,,ఈ సమాజం కూడా ఒప్పుకోదు..నన్ను అందరూ చులకన గా చూస్తారు..అంటూ బాధ గా కంట తడి పెట్టింది దీప్తి..ఎవరో ఏదో అనుకుంటారు అని నా మనసు ని కష్ట పెట్టుకోమంటావా,,నేను మొదటి సారి నిన్ను చూసినప్పుడే నిన్ను ఇష్టపడ్డాను,,అప్పుడు నీకు పెళ్లి అయిందని నాకు తెలియదు,,,తర్వాత తెలిసింది స్నేహితుల ద్వారా నీకు పెళ్లి అయ్యి భర్త నాలుగు రోజుల లోనే రోడ్ ఆక్సిడెంట్ లో మరణించాడు అని...అది ఏదో విధివశాత్తు జరిగిన ఘటన...ఆ విషయం తెలిసినాక కూడా నా లో నీ పై ఉన్న  ప్రేమ ఏమి మారలేదు,,ఇంకా ఇష్టం పెరిగింది..నీ కాళ్ళ మీద నీవు నిలబడేందుకు ఆ ఘటన నుండి మనసు మళ్ళి ఇంచుకునేందుకు  నువ్వు చక్కగా ఉద్యోగం కూడా చేసుకుంటున్నావ్  ,,ఆ పాత  గాయం నే గుర్తు చేసుకుంటూ జీవితాన్ని ముగించేస్తావా ,,,ఇంటిలో  వాళ్ళను ఒప్పించు మనం ఇద్దరం పెళ్లి చేసుకుని హయిగా ఉందాం...అని ఒప్పించ చూసాడు దీప్తి ని...ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా ఈ ఊరిలో  వాళ్ళు నవ్వుతారు శ్రీను....ఏవో సినిమాల వరకే పరిమితం అలాంటి సామజిక వివాహాలు మన పల్లెటూరి లో అలాంటివి సాధ్యం కావు,,,అందరిని ఎదిరించి మనం మాత్రం ఎలా సుఖం గా ఉండగలం,,ఇలాగే ఉండాలి అని నా జీవితం రాసిపెట్టి ఉన్నట్టుంది ...నా వలన నువ్వు ఇబ్బందులు పడటం నాకు ఇష్టం లేదు,, పెద్దవాళ్ళను ఒప్పించగలిగితే  అప్పుడు చూద్దాం  అని చెప్పి అక్కడినుండి ఏడుస్తూ వెళ్ళిపోయింది దీప్తి..
తరువాత ఇరువురి ఇళ్ళల్లోను ఒప్పించటానికి చాలా ప్రయత్నాలే చేసాడు శ్రీను,,,మనసులో ఒప్పుకోవాలి అని ఉన్నా  బంధువులు,చుట్టూ పక్కల వాళ్ళు,సమాజం ఏమంటుందో అన్న భయం తో ఇరువురు తల్లిదండ్రులు ఈ పెళ్ళికి అంగీకరించలేదు...స్నేహితుల సహాయం తో దీప్తి ని ఒప్పించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు శ్రీను
 టీవీ వాళ్ళు,పేపర్ వాళ్లు..శ్రీను ఔదార్యాన్ని ఎంతో మెచ్చుకున్నారు,,,ఆ రోజూ అంతా టీవీ లలోను,ఊరి  లొనూ అందరూ శ్రీను ను పొగుడుతూ ఉంటే శ్రీను తల్లిదండ్రులు ఎంతో బాధ పడ్డారు...కన్న కొడుకు మనసుని అతని ఔన్నత్యాన్ని గ్రహించాలేకపోయమే..ఎవరో అనుకుంటారు అని ఇరువురి మనసులు నొప్పించామే,,అయినా వాడు చేసిన పని లో తప్పు ఏమి లేదే ఒక మనిషి కి జీవితాన్ని ఇచ్చాడు,,,వాడి  ప్రేమను గెలుచుకున్నాడు,,అనవసరం గా పంతానికి వెళ్ళాం  అని బాధపడి మనసార నూతన వధువరులను దీవించి తమ ఇంటికి స్వాగతించారు...మగవాళ్ళ లో మృగాళ్ళే కాదు..మనసున్న మగవాళ్ళు కూడా ఉన్నారు అని నిరూపించాడు శ్రీను...
------------------------------------------------------------------------------------------------------------------------
ఇది నా ఉహా కధా కానే కాదు,,,నిజం గా ఈ విధం గా పెళ్లి చేసుకున్న జంట ఉన్నారు  మా ఊరిలో ,,,పేరులు అవే పెట్టటం బాగుండదు అని పేర్లు మార్చాను,,,ఎప్పుడో ఆరునెలల క్రితం జరిగిన విషయం...రాద్దాం అనుకున్నా కాని ఇప్పటిదాకా కుదరనే లేదు,,,ఆడవాళ్ళ మీద ఆసిడ్ పోసే క్రూరులు ఉన్నారు,,,మంచి గా అర్ధం చేసుకుని జీవితాన్ని ఇచ్చే మగ వాళ్ళు ఉన్నారు,,,మన మీడియా కూడా మంచి చేసే వాళ్ళను ఏనాడు ప్రోత్సహించదు,,అలాంటి వాళ్ళను నలుగురిని చూపించి వాళ్ల గురించి చెప్పినా కొంత అన్నా మార్పు వస్తుంది సమాజం లో,,మన ఆలోచన ధోరణిలో.. 

Jul 9, 2011

చిల్లర

రెండు రొజుల క్రితం నేను  మాకు దగ్గర లొ ఉన్న గుడి కి వెళ్ళాను..
గుడి  బయట  కూర్చునే  యాచకులకు  చిల్లర  వేద్దాం  అని  ముందే  కొంత  చిల్లర  తీసుకుని  వెళ్ళాను.దర్సనం అయిపోయినాక ఒక ఇద్దరికీ చిల్లర వేసాను.పది పైసల్లు,ఇరవై పైసల కాలం ఎప్పుడో పోయింది కదా..అందులోను ఈ మధ్యే పావలా కూడా అధికారికం గా పోయింది..government ఇప్పుడు announse చేసింది కానీ నాకు తెలిసి అయిదు ఆరేళ్ళ క్రితమే పావలా పరువు పోయింది,,అప్పట్లోనే పావలా ను ఎవ్వరూ తీసుకునేవారు  కాదు,,అందుకని కొన్ని అర్ధ రూపాయి బిళ్ళలు ఉంటే వాటిని ఇప్పుడే ఖర్చు చేద్దాం తొందరలో దానికి కూడా వేల్యూ పోతుంది అని ఏవో నా దగ్గర ఉన్న నాలుగయిదు అర్ధరూపాయలు కొన్ని రూపాయి బిళ్ళలు తీసుకుని  వెళ్ళా  గుడి కి,,,మొదటి ఇద్దరికీ అర్ధ రూపాయి వేసేసరికి ఇదేంటి  అమ్మ  ఇది చెల్లదు కదా అని ఒకేసారి అన్నారు వాళ్ళు..రెండు రూపాయలు ఉంటే వేయండి అమ్మ  అని అన్నది వాళ్ళల్లో ఒకావిడ,,వాళ్ల దృష్టి లో అర్ధ రూపాయి,రూపాయి  కు కూడా విలువ లేదు,,పావలా కి ఇప్పుడు విలువ లేనిది అర్ధరూపాయి కేమైంది.అర్ధరూపాయి చెల్లుబడి అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయా .,,చిల్లర అంటే అయిదు రూపాల బిళ్ల అనే కాలం వస్తుందేమో అని అనిపిస్తోంది,,,తొందరగా రూపాయి బిళ్ళలు కూడా ఖర్చు చేసుకుంటే మంచిదేమో,,

Jun 14, 2011

సరదా స్లిప్పులు

ఈ సరదా dialogues నేను ఈ మధ్యనే చూసాను,,,ఇదే మొదటి సారి ఇది చూడటం.. నాకు బాగా నచ్చింది,,,బహుసా మీలో కూడా చూడని వాళ్ళు ఉండి ఉండొచ్చు,,,చదివి ఎంజాయ్ చెయ్యండి,,,

 ************************************************

మహేష్  బాబు: ఎన్ని స్లిప్పులు పెట్టామని కాదు అన్నయ్యా....question దిగిందా లేదా ???

JR NTR :: ఈ కాలేజీ లో మొదట స్లిప్పులు పెట్టింది మా తాత,,దొరికింది మా తాత,,వాటితో మీరేంటి నన్ను పీకేది...

SAI KUMAR :   కనిపించే ఈ ౩ పేపర్లు..1 .question పేపర్, 2 .ఆన్సర్ పేపర్ ౩.additional పేపర్ ...కనిపించని ఆ నాలుగో  పేపర్ నే రా స్లిప్పు

చిరు: నువ్వు  3 స్లిప్స్  పెట్టు…మరో  ముగ్గురికి  3 స్లిప్స్  పెట్టమని  చెప్పు …అలా  మొత్తం  concepts cover చెయ్యొచ్చు
BALAKRISHNA: Kumaraswamy, Gopalaswamy, Nagendraswamy, ఇలా  ముగ్గురు  స్లిప్పులు  పెట్టి దొరికిపోతే . ఈసారి  పెట్టేవాడు  కానీ  దొరికేవాడు  కాకూడదని  మొక్కి  మరి  పెట్టాడు  రా  మా  నాన్న  నాకు  స్లిప్ స్వామి  అని …
UDAY KIRAN: ఛి  ఛి  మీ  lecturers ఉన్నారే  మాలాంటి  students ని  ఎప్పుడు  encourage చేయరు . రేపు  ఇదే  exam hall లో మీ  అందరి  ముందు  slip పెట్టి  రాసి  మా  youth power ఏంటో  చూపిస్తా 
VENKATESH: any   center single slip Ganesh………
PAWAN KALYAN  :Main sheet చుస్తే  కోపం  రాలేదు …Slip చూస్తే  కోపం  వచ్చింది   . ఎందుకు  అని  నేను ప్రశ్నిస్తున్నాను  అంతే...
 


Apr 18, 2011

చమత్కార చాటువులు

ఎప్పుడో  చిన్నప్పుడు  అర్ధం  అయ్యి  అవ్వక ,,నెత్తి  నోరు  బాదుకుంటూ  మార్కుల కోసమే చదివిన  చాటువులు  ఇప్పుడు మళ్లీ చదువుతుంటే  వీటిలో  ఇంత  అందమైన  అర్ధం  ఉందా  అని  అనిపిస్తోంది .మా బంధువు అడిగిన ప్రశ్నకోసం వెతుకుతుంటే ఇలాంటి చాల అందమైన చాటువులు కనిపించాయి..మరొక్కసారి చదవండి మీరు కుడా..
                         వడపై నావడపై పకోడీపయి  హల్వాతుంటిపై బూంది యూం 
                         పొడిపై నుప్పిడి పై  రవిడ్డిలిపయిం బొండాపయిన్సేమీయీ 
                         సుడిపై బారు భవత్క్రుపారసము నిచ్చో గొంత రానిమ్మునే 
                         నుడుకుం గాఫిని ,యొక్క గ్రుక్క గొనెవే యో   కుంభదంభోధరా!!!!
చిరుతిండ్ల మీద ఆసక్తి ఉన్న ఒక భోజన ప్రియునిపై ప్రయోగించిన పద్యమిది..
గారెల మీద,పెరుగు వడ మీద,పకోడీల  పైన ,హల్వా ముక్కమీద,బూంది మీద,ఉప్మా మీద,రవ్వ ఇడ్లీ పైన,బోండా పైన,సేమియా పాయసం పైన నీ దయ రసం చక్కగా ప్రసరించి,చక్కగా వాటిని అరగించావు కదా, కడవ వంట ఉదరము కల వాడా!,అటువంటి దయారసాన్ని నా మీద కూడా కొంచెం ప్రసరించి వేడి కాఫీ ని నన్ను కూడా ఆరగించు,నీకు నమస్కరిస్తున్నాను,,
అని అ భగవంతున్ని వేడుకొంటున్నాడు..
                               నడవకయే నడచి వచ్చితి 
                               నడచిన నే నడిచి రాను నడచెడునటులన్
                               నడపింప నడవనేరన్   
                               నడవడికలు చూచి నన్ను నడి పింపరయా !!!
 కుటుంబ పోషణ సరిగా నడవకనే ఇంత దూరం కాలినడకతో వచ్చి నాను జరుగుబాటుంటే నడిచిరాను,నా స్వభావాన్ని,నడకను గమనించి,నా కుటుంబాన్ని నడిపించే శక్తీ కలుగునట్లు చేయండి అని చమత్కారం గ వేడుకున్నడా కవి..   
                                 అక్షరంబు వలయు  కుక్షి జీవనులకు 
                                నక్షరంబు జిహ్వాకిక్షురసము
                                అక్షరంబు తన్ను రక్షించు గావున 
                                నక్షరంబు లోకరక్షితంబు 
మానవులకు చదువు కావలి.,చదువు నాలుకకు చెరకు రసము లాంటిది.చదువే మనిషిని రక్షించును కాబట్టి మనిషి కూడా చదువును రక్షించాలి.
                              భరత ఖండంబు చక్కని పాడియావు 
                              హిందువులు లేగదూడలై యేడ్చు చుండ 
                              తెల్లవారను గడసరి గొల్లవారు 
                               పితుకుచున్నారు మూతులు బిగియ  గట్టి..
రాజమండ్రి కాంగ్రెస్స్ సభలో బిపిన్ చంద్రపాల్ ఉపన్యసించినప్పుడు చిలకమర్తి లక్ష్మి నరసింహం గారు ఆశువు గ చెప్పిన పద్యం ఇది,,
                          అయన ఇప్పుడు ఉండి ఉంటె ఎలా స్పందిన్చేవారో  అనిపిస్తోంది..         
ఇలాంటివి చాలానే ఉన్నాయి,,ఇవి చదువుతుంటే ఎంత గొప్ప గ రాసారో అనిపిస్తుంది..ఇంత అందమైనదా మన తెలుగు అని అనిపించక మానదు,,
      

Apr 16, 2011

నవ్వుకోండి సరదాగా

 నేను చదివిన వాటిలో నాకు నచ్చిన జోకులు,,మీరు సరదాగా చదివి కాసేపు ఆనందించండి..

డిశ్చార్జ్ అయి వెళ్లబోతున్న పేషెంట్ తో " ఇప్పుడు తేలిగ్గానే ఉంది కదూ!" అడిగాడు డాక్టర్. "కరక్టే..... డాక్టర్! ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది." అంటూ జవాబిచ్చాడు పేషెంట్ పర్సు తడుముకుంటూ
                                         


జడ్జి: "నువ్వెన్టయ్య మాటిమాటికి వాళ్ళింట్లోనే దొంగతనం చేస్తున్నావు?" దొంగ: " నేను వాళ్ల ఫ్యామిలీ దొంగని సార్."


రెండు  చీమలు  బాగా  తప్ప  తాగేసి  రోడ్  మీద  తిరుగుతున్నాయి ,ఇంతలో  అక్కడికి  ఒక  ఏనుగు  వస్తుంది  వాళ్ళకి  అడ్డంగా  ........
1st చీమ  అంటుంది  : ఇపుడు  రారా   చూసుకుందాం  అంటుంది  ఏనుగుని  .

2nd చీమ  అంటుంది  : వదిలేయ్    మామ  మనం  ఇద్దరం  వున్నాము  పాపం  వాడు  ఒక్కడే  ఇంకేమి  వస్తాడు  లే  అని  .

 
అడవి  లో  వొక  ఎలుక  పెళ్లీడు  కి  వచ్చింది . ఆ  ఎలుక  కి  పెళ్లి  సంబంధాలు  చూస్తున్నారు . వొక  రోజు  ఎలుక  ను  చూడటానికి  ఏనుగు  వచ్చింది . ఎలుక  కి  ఏనుగు  నచ్చలేదట  ! ఎందుకు ? అంటే  "అబ్బాయికి  పళ్ళు  బయటకి  కనిపిస్తున్నాయి " అని  చెప్పింది !!!!


 భర్త కోసం ఆఫీసుకు ఫోన్ చేసింది ధనలక్ష్మి. "కొంచెం మా ఆయన్ను పిలుస్తారా?" అడిగింది ఆపరేటర్ని.
"number please" అడిగింది ఆపరేటర్.
"నెంబరేమిటి నీ బొంద. నాకేమైనా పదిమంది మొగుళ్ళనుకున్నావా?" కయ్*మంది ధనలక్ష్మి. 


"నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు
"అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి.
"మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు
"మీ అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి.

Apr 9, 2011

తెగులు పట్టిన తెలుగు


ఇవ్వాళ మా బాబు స్కూల్ లో పేరంట్స్ మీటింగ్ జరిగింది,ఇంక నాలుగురోజుల్లో వేసవి శెలవలు మొదలు అవ్వటం తో స్కూల్ గురించి పేరెంట్స్ ఒపీనియన్ అండ్ suggestions తెలుసుకోడానికి  చిన్న మీటింగ్ పెట్టారు,,సరే అందరిని నాలుగు ముక్కలు మాట్లాడమన్నారు వాళ్ల వాళ్ల thoughts ,,సరే నేను కూడా ఏదో కొంచెం చెప్పాలి గా,, పాజిటివ్ గా నే చెప్పాను అంతా ,,ఆ ప్రిన్సిపాల్ ఇంకా గుచ్చి గుచ్చి ప్రశ్నల వర్షం కురిపించింది,,,మీ బాబు స్కూల్ చేరకముందు కి ఇప్పటికి ఏమైనా improvement ఉందా?? ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడా??(అదే చిన్న చిన్న పదాలు )..అట్లాగు,,మా బాబు స్కూల్ కు చేరకముందు చక్కగా అమ్మ,నాన్నగారు అంటూ చిలకపలుకులు పలికేవాడండి..ఇప్పుడు మమ్మీ,డాడీ తప్ప నాన్న అని కూడా అనటంలేదు అన్నాను..ఆవిడ తెగ సంబర పడింది అబ్బో ఇంగ్లీష్  మాట్లాడేస్తున్నాడు వీడు అని,,,తెలుగు rhymes కూడా ఒక్కటి చెప్పలేదు స్కూల్ లో..ఇంక అక్షరాల సంగతి ఏముంది అస్సలు గుర్తు కూడా లేదు వాళ్ళకు నేర్పించాలి  అని,,కనీసం గుర్తుపట్టాలి కదా  LKG లో అన్నా,,,ఇంకా హిందీ rhymes చెప్తారు బాగా. హిందీ కు ఇచ్చిన importance తెలుగు కు ఇవ్వట్లేదు ...అదేవిషయం అడిగా ఇవ్వాళ కనీసం చిన్న చిన్న rhymes ,దేవుడి slokas అంటే ప్రార్ధనలు అట్లాంటివి కొంచెం కొంచెం ట్రై చేయండి,,atleast తెలుగు రాయటం నేర్పకపోయిన గుర్తుపట్టటం నేర్పండి అని,,,,ఆవిడ సమాధానం కు నాకు మైండ్ బ్లాంక్ అయ్యింది ఇప్పుడు ఎవ్వరూ నేర్పట్లేదండి 5th క్లాసు నుండి వస్తుంది తెలుగు లాంగ్వేజ్ అని...అయిన మా టీచర్స్ అందరూ malayalees ,,montissory ఫాలో అవుతాం మేము. సో spl గా trained టీచర్స్ తెప్పించాము కేరళ నుండి,, మరి  వాళ్ళకు తెలుగు రాదు కదా అని,,,nursary స్కూల్ వాల్లేమో higher స్కూల్ లో నేర్పిస్తారు అని తోసేస్తారు విషయాన్నీ,,,పెద్ద స్కూల్ లో నేమో మెయిన్ సబ్జక్ట్స్ మీద concentration ,,ఇంకా సెకండ్ లాంగ్వేజ్ కూడా sanksrit నే గా అందరూ ,,ఇప్పుడు దాదాపు సగం మంది 10th పిల్లలకు తెలుగు రాయటం కూడా రాదు సరిగ్గా(నేను గమనించినంత  వరకు)..మరీ సాహిత్యం పండించాలి మాటలో భాష లో అనను కానీ కనీసం చిన్న చిన్న మాటల్లో అయిన రాయటం రావాలి కదా తెలుగు వాళ్ళం అయినందుకు,,,ఊరికే తెలుగు దినోత్సవాలు అవి ఇవి చేస్తారు కాని compulsory సబ్జెక్టు చేస్తే కానీ  వచ్చే తరానికి తెలుగు భాష రాదు..లేకపోతె మార్కులే ద్యేయం గా పెట్టుకునే స్కూల్స్ తెలుగు ను తుంగ లో తొక్కేస్తారు,...

Mar 25, 2011

మనోవేదన

                                         
                                                  నీకోసం నిరీక్షిస్తూనే ఉన్నాను
                                                          నువ్వు రావని తెలిసినా,,
                                                  నీ గురించే ఆలోచిస్తుంటాను
                                                          నువ్వు ఎదుట లేకున్నా,,
                                                 నిను నా మనసులోనే కొలువుంచాను
                                                         నీవు నను వీడినా..
                                                 రాబోవు జన్మల లో నైన 
                                                        నను నీ దరిచేరనీయు ప్రియతమా!!!!!!!!!
 

Jan 31, 2011

Funny Titles

I got this  mail from my friends
Doctors bollywood movies తీస్తే వాటి  పేర్లు  ..
                                   Kabhi khansi kabhi jukam
                            kaho naa bukhar hai
                            Kal patient ho na ho
                            Hum blood de chuke sanam
                                   injection de basanti
                            bachna impossible
                            mein , meri nurse or woh
software engineers Bollywood movies తీస్తే 
                  Debugging Koi Khel Nahi
                  Meri Disc Tumhare Paas
                 
Java Wale Job Le Jayenge 
                  Hum Apke Memory Mein Rehte Hein
                 
Client Ek Numbari - Programmer Dus Numbari
                 
Tera Code Chal Gaya
                  Hang To Hona Hi Tha
   

Jan 26, 2011

బొమ్మల కధ

                                                                       అవి నేను చదువుకునే రోజులు..
ఒక రోజు ఒక అమ్మాయిని చూసాను....
ఆ నా మదిని దోచేసింది...
 నీ హృదయం లో నన్ను దాచెయ్యి అని గిఫ్ట్ ఇచ్ఛా..
సిగ్గు తో మెలికలు తిరిగిపోయింది..

 రోజూ గంటలు గంటలు కబుర్లు...
 క్లాసుల్లో నిద్ర..
అందరి దృష్టి మా మీదే..
అలా ఆనందం గా రోజులు గడిచిపోతుంటే మధ్యలో ఒక అనుహ్యకరమైన ఘటన జరిగింది..
మా ఫైనల్ ఎక్షమ్ result రానే వచ్చాయి...

తను పాస్ అయ్యింది,,నేను ఫెయిల్ అయ్యాను as usual గా.. 

ఫ్లవర్ తీసుకు  వెళ్లి క్లాసు ఫస్ట్ వచ్చినవాడికి ఇచ్చింది  ..
నాకు కోపం వచ్చింది..
వెళ్లి అడిగినందుకు నాకు gudbye చెప్పింది..ఆ అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పింది..
.                     ఈ బాధ నుండి బయటపడటానికి స్మోకింగ్,drinking కు అలవాటు పడ్డాను...
నా లైఫ్ చేజేతులారా నాశనం చేసుకున్నాను....తను మాత్రం బాగా చదివి మంచి గా సెటిల్ అయ్యింది లైఫ్ లో...

సో dont వేస్ట్ యువర్ టైం ఇన్ లవ్..

                                                                     

Jan 19, 2011

వంటిల్లు

నేను:అంతా  మీరే  చేసారు,మొత్తం మీరే చేసారు..
చాలు అండి,పెళ్లి అయినప్పటి నుండి మీరు నా చేత చేయించింది చాలు,నేను కోల్పోయింది చాలు..ఇంకా ఒద్దండి ప్లీజ్.
శ్రీవారు:నేనా నేనేమి చేసాను??
నేను: మీరు ఎప్పుడూ నా చేత మీకు ఇష్టమైన కూరలే చేయించేవారు..అది కూడా మీకు ఇష్టమైన రీతిలో..ఆ కూర నాకు అస్సలు ఇష్టముందో లేదో కూడా అడగరు..నేను తింటానో లేదో కూడా తెలియదు మీకు.
శ్రీవారు:నీకు ఇష్టం లేదని చెప్పొచ్చు గా,,నీకు నచ్చిన వంట నే చేయొచ్చు గా
నేను:నేను ఇవ్వాళ ఇది చేద్దాం అని ఎంతగానో అనుకుంటాను...ఈ కూర ఇలా కాదు అలా చెయ్యి అంటారు.నేను గుత్తివంకాయ కూర చేద్దాం అని అనుకుంటాను ఇంతలో మీరు వచ్చి ఇది కూరల్లో పొడి వేసి చెయ్యి అంటారు...సరే అలాగే చేద్దాం అనుకుంటాను నేను.ఇంతలో వచ్చి ఇందులో ఈ పప్పులు ఆ పప్పులు కలిపి పొడి చేసి వెయ్యి అంటారు..
నేనేదో పుల్కాలు చేద్దాం అనుకుంటాను మీరేమో పూరి కావాలి అంటారు,,
నాకు గట్టిగ అరవాలి అనిపిస్తుంది నేను ఇలాగె చేస్తాను..అలా రుచి బాగుండదు,,ఆరోగ్యము కూడా కాదు అని...
కానీ మీకు ఇష్టము కదా ఇలా చేస్తే అని కేవలం మిమ్మల్ని గెలిపించటానికి ప్రతిపూట  నేను ఓడిపోతూనే ఉన్నాను..
ఇలాగే ఓడిపోతూ ఉంటే ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే నాకు ఏ వంటా పూర్తీ గా రాలేదు అని అనిపిస్తోంది.
ఇన్నాళ్ళు నేను వంట చేస్తున్నాను అనుకుంటున్నాను..కాని చెయ్యట్లేదు మీరే  చేయిస్తున్నారు...ఇకముందు కూడా ఇలాగే ఉంటాను...
కానీ నాదొక్క రిక్వెస్ట్..నేను చేసిన వంట రుచి అమ్మ చేతి వంట రుచి లాగానో,హోటల్ లో ని రుచి లాగానో ఉండాలి అని కోరుకోవద్దండి  PLZ ..


    ***************************************************************************************
హాహా ఏంటి ఇంత సీరియస్ గా రాసింది అనుకుంటున్నారా?? ఇవ్వాళ గుత్తి వంకాయ కూర చేద్దాం అనుకున్నాను,,మా వారు వచ్చి కూరల్లో పొడి వేసి చెయ్యి అన్నారు,అప్పుడు నాకు అనుకోకుండా బొమ్మరిల్లు cinedialogues గుర్తు వచ్చాయి...
సినిమాలో dialogues బానే ఉన్నాయి గాని..ఒక్కోసారి అరె మనకు అనిపించింది చేయలేకపోతున్నామే అని అనిపించక మానదు ఏ situation లో అయిన...అందుకే సరదాగా రాసా ఇది...అందుకే బొమ్మరిల్లు బదులు టైటిల్ వంటిల్లు అని పెట్టా..

 

Jan 16, 2011

Funny letters

                                     DORMITORY 

దీనిలో ని అక్షరాలను మార్పు చేస్తే ఎమోస్తుందో చూడండీ
                                     A DIRTY ROOM 
  అలాగే ఇంకొక మూడు ఉన్నాయి చూడండీ...
                         THE EYES  change చేస్తే THEY SEE
                         ASTRONOMER Change చేస్తే MOON STARER 
                         DECIMAL POINT Change చేస్తే DOT IN A PLACE

బాగున్నాయి కదూ,,ఎప్పుడో ఒకసారి ఈనాడు సండే బుక్ లో పబ్లిష్ చేస్తే నోట్ చేసుకున్నా నా బుక్ లో..నిన్న సర్దుతూ ఉంటే ఆ పుస్తకం నా కంటపడింది..సో ఒకసారి అంతా చదివా..ఇవి కనిపించాయి..బాగున్నాయి ,అందరూ చూస్తారు అని పోస్ట్ చేస్తున్నాను..
ఇలాంటివి మీకు తెలిసినవి కూడా ఉంటే నాకు చెప్పండి...

Jan 12, 2011

మార్పు

గత రెండు రోజుల నుండి నాలో నాకే తెలియని మార్పు కనిపించింది.దానికి కారణం మా టీవీ సరిగా రావటం లేదు..సో అస్సలు టీవీ చూడటం లేదు.దీనికి తోడు కంప్యూటర్ కూడా పాడయింది...నా బతుకు కుడితి లో పడ్డ ఎలుక ల ఉంటుందేమో ఏమి తోచక అని అనుకున్నాను నేను.కానీ చిత్రం గా చాలా ఆనందం గా గడిచింది..మా బాబు కు బడికి శెలవలు ఇచ్చారు..ప్రతిరోజూ అయితే అల్లరి చేస్తున్నాడు అని కోప్పడుతుండే దాన్ని...ఇప్పుడు టీవీ లేదు,కంప్యూటర్ లేదు కదా ఇంక నాకే ఏమి చేయాలో తోచక బాబు తో ఆడుకోవటం,abcd నేర్పటం,లెటర్స్ దిద్దించటం అలా ఏదో పని చేస్తూనే ఉన్నాను..పని లేకపోయినా కలిపించుకుని చేస్తున్నాను..ఇది వరకు అయితే టీవీ లో ఏదో సినిమా నో సీరియల్ నో చూస్తూ ఉండేదాన్ని...లేదా కంప్యూటర్ లో online ఉండే మా ఫ్రెండ్స్ తో చాట్ చేస్తూ ఉండేదాన్ని.కూర్చున్న చోట నుండి కదలాలి అంటే బద్ధకం వేసేది.గంటలు నిముషాల్లగా గడిచేవి.మా బాబు ఆడుకుందాం రా అని పిలిచినా టీవీ లో బొమ్మలు చూద్దాం అనో,,ఇంట్లోనే ఆడుదాం అనో ఏదో చెప్పి సర్దిపుచ్చేదాన్ని..రా రా ఆడుకుందాం అని పిలుస్తూ ఉంటే నస పెడుతున్నావ్  అని పాపం చికాకు పడేదాన్ని,ఏదో ఆ టైం కు కరెక్ట్ గా సీరియల్ లోనో సినిమా లోనో suspence సీన్ వస్తుండేది.ఏం చేస్తాం.మనసు లాగుతుంది టీవీ వైపు .మరి ఇంతా చూసాక ఆ ఒక్క సీన్ మిస్ అయితే ఎలాగు అనిపిస్తుంది.నాకు తగ్గట్టే జెమిని మూవీస్ వాడు gap లేకుండా సినిమాలు వేస్తాడు..ఒకటి అయ్యేలోపు ఇంకొకటి,దేనికదే చూద్దాం ఇప్పుడు అంత పనేముంది లే అని అనిపిస్తుంది.ఇంక సాయంత్రం మా వారు ఆఫీసు నుండి వచ్చి రాగానే laptop ముందు కూర్చుంటారు..ఇంక ఇంట్లో వాళ్లతో ఏమి కబుర్లు కమామీషు ఉండదు,అన్నం తినేటప్పుడు కూడా ఆ టీవీ చూస్తూ ముద్ద లోపలకు పోతుంటుంది.కానీ ఈ రెండు రోజులు భిన్నం గా ఆనందం గా గడిచాయి.ఇది వరకు ఆడవారు అంత నాజూకు గా పని అంతా ఎలా చేసుకునేవారా అనుకునేదాన్ని..ఏముంది ఏమి తోచక కూడా ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండి ఉంటారు కదా..ఇప్పటి వాళ్ల లాగా కంప్యూటర్ కు అతుక్కుని ఉండరు కదా గంటలు గంటలు కూర్చొని...టెక్నాలజీ వచ్చి  మంచి జరిగినా
గంటలు గంటలు ఇలాగా కంప్యూటర్ ల ముందు,టీవీ ల ముందు కూర్చుంటే చాలా నష్టపోతామేమో అని అనిపిస్తోంది..అతి సర్వత్ర వర్జయేత్

Jan 10, 2011

హాస్య సంభాషణలు

customer,call center executive ల  మధ్య  న  జరిగే  హాస్య  సంభాషణలు 
Customer: I have a huge problem. A friend has placed a screensaver on my computer, but every time
I move the mouse, it disappears!

               ***************************************************************
Helpdesk: How may I help you?
Customer: I'm writing my first e-mail.
Helpdesk: OK, and, what seems to be the problem?
Customer: Well, I have the letter a,
but how do I get the circle around it?
                 
                  ***************************************************************
Customer:Hi good afternoon, this is Martha, I can't print. Every time I try it says 'Can't find printer'. I've even lifted the printer and placed it in front of the monitor, but the computer still says he can't find it...
  
              *****************************************************************
Helpdesk: What's on your monitor now ma'am?
Customer: A teddy bear my boyfriend bought for me in the supermarket.

                   
***************************************************************
Helpdesk: What kind of computer do you have?
Customer: A white one...

                   
*****************************************************************
Customer: Hi, this is Celine. I can't get my diskette out.
Helpdesk: Have you tried pushing the button?
Customer: Yes, but it's really stuck.
Helpdesk: That doesn't sound good; I'll make a note ...
Customer: No ... wait a minute... I hadn't inserted it yet... it's still on my desk... sorry ....

Jan 9, 2011

పరీక్షలు

 నా ఫ్రెండ్ పంపిన మెయిల్ ఇది,,సరదాగా బాగుంది మీరు కూడా చదవండి..

మన హీరోలు పరీక్ష రాయటానికి వచ్చారు. వచ్చి ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించారు.
పరిక్ష మొదలైన 10 నిమిషాల తరువాత వచ్చాడు మహేష్ బాబు
ఏంటి బాబు లేట్ అంటే ..

*మహేష్:* ఎప్పుడు వచ్చామని కాదు అన్నయ్య పరీక్ష రాశామా లేదా ..? అని వెళ్ళి
కూర్చున్నాడు.
(వెనకున్న చిరంజీవి బ్రదర్ ఇది తీసుకో అని స్లిప్ ఇచ్చాడు
మహేష్ థాంక్స్ చెబితే)

*చీరంజీవి:* థాంక్స్ కాదు బ్రదర్ ఆ స్లిప్ ను మూడు చేసి ముగ్గురికి ఇవ్వు, ఆ
ముగ్గురుని ఇంకో ముగ్గురకు ఇవ్వమని చెప్పు అలా మొత్తం స్లిప్ లు మయం చేయండి.
(అనగానే పక్కనే వున్న రామ్ చరణ్ అందుకుని)

*రామ్ చరణ్: *ఒక్కొకటి కాదు నాన్న, వంద స్లిప్పులు ఒక్కసారి పంపించు 300
వందలమందికి పంచుతా..
(అని కూర్చున్నాడు. అప్పుడు సాయికుమార్ వచ్చి)

*సాయికుమార్: *కనిపించే మూడు పేపర్లు .. Omr పేపర్, క్వశ్చన్ పేపర్, ఆన్సర్
పేపర్ అయితే కనిపించని ఆ నాలుగో పేపరేరా స్లిప్...స్లిప్...స్లిప్.
(అని తన స్లిప్ తను తీసుకుని కూర్చున్నాడు.)

స్లిప్ప్పులు ఎక్కువై కోపం వచ్చిన బాలకృష్ణ

*బాలకృష్ణ:* ఒరేయ్ .. నేను కాపీ కొట్టడం మొదలుపెడితే.... ఏ ప్రశ్నకి ఏ జవాబు
రాసానో కనుక్కోవడానికి వారం పట్టిద్ది. మర్యాదగా ఏ ప్రశ్నకు ఏ స్లిప్పో సరిగ్గా
చెప్పండి.


మరోపక్క స్లిప్పులు దొరక్క ఎగబడుతున్న వాళ్ళను పక్కకు నెట్టిన ప్రభాస్

*ప్రభాస్: *వాడు పొతే వీడు, వీడు పొతే నేను, నేను పొతే నా అమ్మామొగుడు అని
ఎవరైనా స్లిప్ కోసం ఎగబడితే ... దెబ్బకో తలకాయ్ చొప్పున బెంచిలకి బలవుతాయి
అని స్లిప్పు తెచ్చుకు రాసుకుంటున్నాడు.

యన్.టి.ఆర్ బుద్దిగా తన స్లిప్పు తను రాసుకుంటుంటే ఎవడో వచ్చి స్లిప్పు
లాక్కోబోతే వాడి చెయ్యి గట్టిగా పట్టుకుని

*జూ|| యన్.టి.ఆర్ : *రేయ్... సాఫ్ట్ గా లవర్ బాయ్ లాగా ఉన్నాడు అనుకుంటూన్నవేమో
... లోపల ఒరిజినల్ అలాగే ఉంది. స్లిప్పు వదల్లేదో ..... రచ్చ..రచ్చే..!
(అన్నాడు. ఈ లోపు ఎగ్జామ్ స్క్వాడ్ వచ్చి పేపర్లు లాక్కుని అందరినీ బయటకు
పంపారు. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా...అని అందరు ఆలోచిస్తుంటే, అందరికన్నా చివరన
వచ్చాడు రవితేజ )

*రవితేజ: *ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా.. అనేగా మీ డవుటు.... నేనే...ఇచ్చా...!
ఊరికినే కాపీ కొడితే.... కిక్ ఏముంది నా అప్పడం. అందుకే స్క్వాడ్ ను పిలిచా..!
అని అక్కడి నుండి పరిగెత్తాడు. పట్టుకోవడానికి రవితేజ వెనకాల పడ్డారు మిగిలిన
అందరు..

Jan 4, 2011

గ్రహాలు

నవగ్రహాల గురించి మనకు తెలుసు కదా ..కాని ఈ గ్రహాల తల్లి దండ్రులు,భార్య ఎవరో తెలుసా మీకు,,నాకు కూడా ఇదివరకు తెలియదు ఈ మధ్యనే ఒక పుస్తకం లో చూసాను.ఆ విషయాలు ఇక్కడ ఇస్తున్నాను,.,ఒకవేళ తప్పు ఏదైనా ఉంటే చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను..

నవగ్రహాలు                    తల్లి                         తండ్రి                                 భార్య 

రవి                             అతిది                       కశ్యప                                ఉష,ఛాయ

చంద్రుడు                     అనసూయ                 అత్రి                                   రోహిణి          

కుజుడు                       భూమి                      భరద్వాజుడు                        శక్తి దేవి

బుధుడు                      తార                         చంద్రుడు                             జ్ఞాన శక్తి దేవి

గురుడు                       తార                         అంగీరసుడు                         తారాదేవి

శుక్రుడు                      ఉష                           భ్రుగు                                 సుకీర్తి దేవి

శని                            ఛాయ                       రవి                                    జ్యేష్ట దేవి

రాహువు                     సింహిక                    కశ్యపుడు                             కరాళి దేవి

కేతువు                      సింహిక                       కశ్యపుడు                            చిత్రా దేవి