Apr 9, 2011

తెగులు పట్టిన తెలుగు


ఇవ్వాళ మా బాబు స్కూల్ లో పేరంట్స్ మీటింగ్ జరిగింది,ఇంక నాలుగురోజుల్లో వేసవి శెలవలు మొదలు అవ్వటం తో స్కూల్ గురించి పేరెంట్స్ ఒపీనియన్ అండ్ suggestions తెలుసుకోడానికి  చిన్న మీటింగ్ పెట్టారు,,సరే అందరిని నాలుగు ముక్కలు మాట్లాడమన్నారు వాళ్ల వాళ్ల thoughts ,,సరే నేను కూడా ఏదో కొంచెం చెప్పాలి గా,, పాజిటివ్ గా నే చెప్పాను అంతా ,,ఆ ప్రిన్సిపాల్ ఇంకా గుచ్చి గుచ్చి ప్రశ్నల వర్షం కురిపించింది,,,మీ బాబు స్కూల్ చేరకముందు కి ఇప్పటికి ఏమైనా improvement ఉందా?? ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడా??(అదే చిన్న చిన్న పదాలు )..అట్లాగు,,మా బాబు స్కూల్ కు చేరకముందు చక్కగా అమ్మ,నాన్నగారు అంటూ చిలకపలుకులు పలికేవాడండి..ఇప్పుడు మమ్మీ,డాడీ తప్ప నాన్న అని కూడా అనటంలేదు అన్నాను..ఆవిడ తెగ సంబర పడింది అబ్బో ఇంగ్లీష్  మాట్లాడేస్తున్నాడు వీడు అని,,,తెలుగు rhymes కూడా ఒక్కటి చెప్పలేదు స్కూల్ లో..ఇంక అక్షరాల సంగతి ఏముంది అస్సలు గుర్తు కూడా లేదు వాళ్ళకు నేర్పించాలి  అని,,కనీసం గుర్తుపట్టాలి కదా  LKG లో అన్నా,,,ఇంకా హిందీ rhymes చెప్తారు బాగా. హిందీ కు ఇచ్చిన importance తెలుగు కు ఇవ్వట్లేదు ...అదేవిషయం అడిగా ఇవ్వాళ కనీసం చిన్న చిన్న rhymes ,దేవుడి slokas అంటే ప్రార్ధనలు అట్లాంటివి కొంచెం కొంచెం ట్రై చేయండి,,atleast తెలుగు రాయటం నేర్పకపోయిన గుర్తుపట్టటం నేర్పండి అని,,,,ఆవిడ సమాధానం కు నాకు మైండ్ బ్లాంక్ అయ్యింది ఇప్పుడు ఎవ్వరూ నేర్పట్లేదండి 5th క్లాసు నుండి వస్తుంది తెలుగు లాంగ్వేజ్ అని...అయిన మా టీచర్స్ అందరూ malayalees ,,montissory ఫాలో అవుతాం మేము. సో spl గా trained టీచర్స్ తెప్పించాము కేరళ నుండి,, మరి  వాళ్ళకు తెలుగు రాదు కదా అని,,,nursary స్కూల్ వాల్లేమో higher స్కూల్ లో నేర్పిస్తారు అని తోసేస్తారు విషయాన్నీ,,,పెద్ద స్కూల్ లో నేమో మెయిన్ సబ్జక్ట్స్ మీద concentration ,,ఇంకా సెకండ్ లాంగ్వేజ్ కూడా sanksrit నే గా అందరూ ,,ఇప్పుడు దాదాపు సగం మంది 10th పిల్లలకు తెలుగు రాయటం కూడా రాదు సరిగ్గా(నేను గమనించినంత  వరకు)..మరీ సాహిత్యం పండించాలి మాటలో భాష లో అనను కానీ కనీసం చిన్న చిన్న మాటల్లో అయిన రాయటం రావాలి కదా తెలుగు వాళ్ళం అయినందుకు,,,ఊరికే తెలుగు దినోత్సవాలు అవి ఇవి చేస్తారు కాని compulsory సబ్జెక్టు చేస్తే కానీ  వచ్చే తరానికి తెలుగు భాష రాదు..లేకపోతె మార్కులే ద్యేయం గా పెట్టుకునే స్కూల్స్ తెలుగు ను తుంగ లో తొక్కేస్తారు,...

5 comments:

 1. మీరు "మాతృభాష ప్రాథమిక విద్య" (ప్రజశక్తి ప్రచురణ) పుస్తకం చదవండి ఇంకా ఇలాంటివి చాలా సంగతులు తెలుస్తాయి

  ReplyDelete
 2. ఒకటి మాత్రం నిజం. తెలుగు మాట్లాడగలిగితే ఆసీఅ లో చాలా భాషలు సులువుగా నేర్చుకోగలరు. english ఎపుడైనా నేర్చుకోవచ్చు. కాని తెలుగు ని చిన్నపుడు నేర్పకపోతే ఇక ఎప్పటికీ నేర్పలేరు.

  ReplyDelete
 3. వినటానికి బాధగా ఉంది. తెలుగు చెప్పే స్కూల్లె లేవా? వెతికి వాటిల్లో చేర్చండి.

  ReplyDelete
 4. ఏ కొద్ది మందో నేర్వనంత మాత్రాన తెలుగును అంత తుంగలో తొక్కేస్తామా?మంజు గారూ ?పుడమి తల్లి గుండెలు తవ్వి చమురు పిండేస్తూ,జలాలను వట్టి పోయేలా చేస్తూ,ఒక సజీవ చైతన్యాన్ని ప్రాణ రహిత కృత్రిమ సౌందర్యంగా మలచి గొప్పగా ఎదిగి పోయానని చాటుకోవలని ప్రయత్నిస్తున్న మన తరం చేసే ఘాతుకాన్ని సాక్షీ భూతంగా చూడడంలేదూ ?ఇదీ అలంటిదే !క్షమించండి .

  ReplyDelete
 5. Hi this is Bhavani, miru rasindi chala bagundi,neti paristulagurinchi chalabaga rasaru,E chadula valla pillalu telugu marichipotunnaru ,adedo gopavishyam laga chala mandi tallitandri bhavistaru anduke antaru teluguvariki tegulu akuva

  ReplyDelete