Apr 18, 2011

చమత్కార చాటువులు

ఎప్పుడో  చిన్నప్పుడు  అర్ధం  అయ్యి  అవ్వక ,,నెత్తి  నోరు  బాదుకుంటూ  మార్కుల కోసమే చదివిన  చాటువులు  ఇప్పుడు మళ్లీ చదువుతుంటే  వీటిలో  ఇంత  అందమైన  అర్ధం  ఉందా  అని  అనిపిస్తోంది .మా బంధువు అడిగిన ప్రశ్నకోసం వెతుకుతుంటే ఇలాంటి చాల అందమైన చాటువులు కనిపించాయి..మరొక్కసారి చదవండి మీరు కుడా..
                         వడపై నావడపై పకోడీపయి  హల్వాతుంటిపై బూంది యూం 
                         పొడిపై నుప్పిడి పై  రవిడ్డిలిపయిం బొండాపయిన్సేమీయీ 
                         సుడిపై బారు భవత్క్రుపారసము నిచ్చో గొంత రానిమ్మునే 
                         నుడుకుం గాఫిని ,యొక్క గ్రుక్క గొనెవే యో   కుంభదంభోధరా!!!!
చిరుతిండ్ల మీద ఆసక్తి ఉన్న ఒక భోజన ప్రియునిపై ప్రయోగించిన పద్యమిది..
గారెల మీద,పెరుగు వడ మీద,పకోడీల  పైన ,హల్వా ముక్కమీద,బూంది మీద,ఉప్మా మీద,రవ్వ ఇడ్లీ పైన,బోండా పైన,సేమియా పాయసం పైన నీ దయ రసం చక్కగా ప్రసరించి,చక్కగా వాటిని అరగించావు కదా, కడవ వంట ఉదరము కల వాడా!,అటువంటి దయారసాన్ని నా మీద కూడా కొంచెం ప్రసరించి వేడి కాఫీ ని నన్ను కూడా ఆరగించు,నీకు నమస్కరిస్తున్నాను,,
అని అ భగవంతున్ని వేడుకొంటున్నాడు..
                               నడవకయే నడచి వచ్చితి 
                               నడచిన నే నడిచి రాను నడచెడునటులన్
                               నడపింప నడవనేరన్   
                               నడవడికలు చూచి నన్ను నడి పింపరయా !!!
 కుటుంబ పోషణ సరిగా నడవకనే ఇంత దూరం కాలినడకతో వచ్చి నాను జరుగుబాటుంటే నడిచిరాను,నా స్వభావాన్ని,నడకను గమనించి,నా కుటుంబాన్ని నడిపించే శక్తీ కలుగునట్లు చేయండి అని చమత్కారం గ వేడుకున్నడా కవి..   
                                 అక్షరంబు వలయు  కుక్షి జీవనులకు 
                                నక్షరంబు జిహ్వాకిక్షురసము
                                అక్షరంబు తన్ను రక్షించు గావున 
                                నక్షరంబు లోకరక్షితంబు 
మానవులకు చదువు కావలి.,చదువు నాలుకకు చెరకు రసము లాంటిది.చదువే మనిషిని రక్షించును కాబట్టి మనిషి కూడా చదువును రక్షించాలి.
                              భరత ఖండంబు చక్కని పాడియావు 
                              హిందువులు లేగదూడలై యేడ్చు చుండ 
                              తెల్లవారను గడసరి గొల్లవారు 
                               పితుకుచున్నారు మూతులు బిగియ  గట్టి..
రాజమండ్రి కాంగ్రెస్స్ సభలో బిపిన్ చంద్రపాల్ ఉపన్యసించినప్పుడు చిలకమర్తి లక్ష్మి నరసింహం గారు ఆశువు గ చెప్పిన పద్యం ఇది,,
                          అయన ఇప్పుడు ఉండి ఉంటె ఎలా స్పందిన్చేవారో  అనిపిస్తోంది..         
ఇలాంటివి చాలానే ఉన్నాయి,,ఇవి చదువుతుంటే ఎంత గొప్ప గ రాసారో అనిపిస్తుంది..ఇంత అందమైనదా మన తెలుగు అని అనిపించక మానదు,,
      

3 comments:

  1. DIFFERENCE IS AT THE SCHOOL AGE WE WILL READ LESSONS FOR SCORING MARKS.MIND NOT MATURE ENOUGH TO UNDERSTAND UNDERLTYING LITERATURE
    WHEN GROWN UP AND HAVING MATURITY BY MATCHING WITH PERSONNEL LIFE EXPERIENCE WE CAN UNDERSTAND THE UNDERLYING THEEM AND BEAUTY OF LITERATURE.

    REGARDS
    ANIL KRISHNA KOTAMRAJU

    ReplyDelete
  2. chala bagundamma nee blog, nee peru lane, may god bless you

    ReplyDelete