Dec 27, 2011

దక్షిణ

పూజలు,వ్రతాలూ  చేసినప్పుడు తాంబూలం ఇచ్చేటప్పుడు మనం అందులో దక్షిణ పెడతాం.దక్షిణ అనేది బ్రాహ్మణుని కోసమే ,ఆయనే తీసుకోవటానికి  దక్షిణ అని పేరు చెప్పి మన దగ్గర వసూలు చేస్తారేమో అని అనుకున్నాను  నేను ,,కానీ ఈ మధ్యనే  దేవి భాగవతం లో చదివేటప్పటికి తెలిసింది,,దక్షిణ అనేది కూడా ఒక దేవత రూపమే అని,దక్షిణ లేని పూజ ఫలించదని ,,ఆ కధా మీరు కూడా చదవండి,,,


పూర్వము గోలోకము లో సుశీల అనే గోపిక ఉన్నది.ఆమె  శ్రీహరి కి అత్యంత ప్రియురాలు.రాధ కు స్నేహితురాలు.విద్యా గుణవతి అయిన యువతి.ఒకనాడు ఆ సుశీల రాధ చూచుచుండగా  శ్రీకృష్ణుని ఎడమ భాగమున నిలుచుండెను.అప్పుడు గోపికలందరిలో అందెవేసిన చేయి అయిన రాధ తన ఎదురుగ ఉండుట చూసి శ్రీకృష్ణుడు భయముతో తల వంచుకొనెను.రాధ ఆ దృశ్యము చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది..అది చూసి శ్రీ కృష్ణుడు అంతర్ధానం అయ్యాడు.శ్రీకృష్ణుడు అంతర్ధానం అవటం చూసి సుశీల,మిగత గోపికలు భయపడిపోయారు.వారందరూ కృష్ణున్ని ప్రార్ధించారు..సుశీల పారిపోయింది,,సుశీల పారిపోవుట,శ్రీకృష్ణుడు కనిపించక పోవుట తెలుసుకొని రాధ సుశీల ను శపించింది,,ఇక నుండి గోలోకము లో కాలు పెట్టరాదు,పెట్టిన భస్మము అవుదువు గాక అని.రాధ శ్రీ కృష్ణుని దర్శనము ఇమ్మని ప్రార్ధించింది,,కాని శ్రీకృష్ణుడు రాధ ముందు కనిపించలేదు.
చాలా సంవత్సరాలు సుశీల తపస్సు చేసి లక్ష్మి దేవి శరీరము లో ప్రవేశించినది.
తరువాత దేవతల అందరూ అనేక యజ్ఞములు చేసారు.కనీ వారు ఆ యజ్ఞముల ఫలమును అనుభవింప లేకుండిరి.అప్పుడు వారు అందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్లి మొర పెట్టుకున్నారు.బ్రహ్మ కొంత కాలము తన మనస్సులో విష్ణు మూర్తి ని ధ్యానించి సమాధానము పొందారు.దాని ఫలితము గా నారాయణుడు మహాలక్ష్మి శరీరము నుండి ఒక దేవి పుట్టించి ఆమెను బ్రహ్మ కు సమర్పించారు.ఆ దేవి లక్ష్మి కు దక్షిణ భాగము నుండి జనించుట చే ఆమెకు దక్షిణ అనే పేరు వచ్చింది. యజ్ఞ భావనుడు దక్షిణ ను తన భార్య గా చేసుకొనెను.దక్షిణ పన్నెండు సంవత్సరాలు గర్భము ధరించి ఒక పుత్రుని కనెను అతని పేరు "ఫలము" .ఈతడు కర్మలను సక్రమముగా పూర్తి చేసిన వారికీ ఫలములను ఇచ్చును.యజ్ఞుడు,దక్షిణా పత్నితో పుత్రఫలముతో కర్మిష్టు లకు ఫలము ఒసగుచుండును.అప్పుడు దేవతలు అందరూ సంతోషించి తమ తమ నివాసములకు వెళ్లారు.
కర్త అగు వాడు తన కార్యము పూర్తి అయిన వెంటనే బ్రాహ్మణులకు దక్షిణ ఈయవలెను.అప్పటికప్పుడే కర్త కు ఫలము సిద్దిస్తుంది.దక్షిణ ఈయనిచో చేసిన పుణ్యము అంతయు బూడిద లో పోసిన పన్నీరు అగును..

No comments:

Post a Comment