టీవీ లో ఈ బడ్జెట్ గురించి చూస్తుంటే నాకు నా చిన్నప్పటి విషయాలు గుర్తువస్తున్నాయి..
నా చిన్నప్పుడు మా నాన్నగారు నెల బడ్జెట్ అంటే నెలవారీ ఖర్చులు ఎ నెలకు ఆ నెల ఒక డైరీ లో రాసేవాళ్ళు. అప్పుడు ATM లు లేవు గా శాలరీ అంతా కాష్ ఇచ్చేవాళ్ళు..సో నెల మొదటి తారీఖున ఎంతవచ్చింది ఎంత ఖర్చులు ఉన్నాయి..అని లెక్కలు వేసేవాళ్ళు,.ప్రతి ఆదివారం బాలన్స్ డైరీ లో ఎంత ఉంది..ఇంట్లో ఎంత ఉంది అని tally చేసుకునేవాళ్ళు..
నేను ఇంటర్ నుండి హాస్టల్ లో ఉండే చదువుకున్నా లెండి..పాకెట్ మనీ ఇచ్చింది,ఖర్చులు కుడా ఇలాగె డైరీ లో రాయమనేవాళ్ళు.. అంటే వృధా ఖర్చులు చేయకుండా ఉంటాము అని.. అలాగే రాసేదాన్ని..
ఇంకా నా జాబు మొదటి లో కుడా శాలరీ కాష్ నే ఇచ్చేవాళ్ళు అది చిన్న కంపెనీ అందుకని,, తర్వాత ATM వచ్చింది ఎకౌంటు create చేసారు... సరే ఖర్చు కాస్త అదుపు లో ఉండాలి కదా అని నేను ATM ministatements అన్ని tally చేసుకుని చూసుకునేదాన్ని.. ఎలాగ ఖర్చు చేస్తున్నాను అని...
ఇంక పెళ్లి అయినాక ఇంకా ఖర్చులు పెరుగుతాయి గా.. నేను నా ఖర్చులు,ఆయన ఖర్చులు,కలిపి ఇంటి కోసం చేసే ఖర్చులు.. ఇంక ఇన్ని statements ఎక్కడ దాచుతాం...కాష్ ఏమి తీసుకు వెళ్తాము అని ATM పట్టుకెల్తాము షాపింగ్ కు ఇంకేముంది అక్కడ అవసరం ఉన్నవి లేనివి చూడగానే నచ్చేస్తాయి...పోనిలే ఉన్నాయి గ డబ్బులు next month తగ్గిద్దాం లే అని కోనేస్తాము .. చేతిలో డబ్బుండి ఇచ్చేస్తుంటే ఆ భాధ వేరు ఇలా ATM ద్వారా ఐతే అంతగా బాధ ఉండదు గా..కూరలు కుడా ఏమి వెళ్తాములే రైతు బజార్ దూరం కదా అని దగ్గరే ఉన్న ఫ్రెష్ లో కొనేస్తాము అక్కడ కార్డు నే.. ఇంక సరుకులు చెప్పేదేముంది అక్కడే...ఇలాగా అయిపోయేటప్పటికి మనం ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది ఖర్చు అయినాక కానీ తెలియటం లేదు..అదే మనం చక్కగా కాష్ తీసుకు వెళ్తే మన దగ్గర ఉన్న వేయి తో తే షాపింగ్ చేసి వద్దుము కదా..
ఇది వరకు కాష్ కదా ఎంత మిగిలిందో చూసుకుని మిగిలింది ముందు జాగ్రత్త గ బ్యాంకు లో వేసుకునేవాళ్ళం ఇప్పుడు మొత్తం బ్యాంకు నే కదా.. ఎంత మిగిలిందో తెలియదు (అంటే ఈ నెల మనం ఎంత సేవ్ చేసాము అనేది... )
కేంద్ర బడ్జెట్ ఎంత important నో మనకు మన ఇంటి బడ్జెట్ కూడా అంటే important .. మనం శాలరీ ఎకౌంటు అనే అక్షయపాత్ర వచ్చింది అని ఎంత సంతోష పడతామో ATM అనే పెద్ద చిళ్లి ఉంది అని కూడా గ్రహించాలి..
షాపింగ్ కు వెళ్ళాల్సి వస్తే ఆయనను నేను ఏమండి డబ్బులు ఇవ్వరా అని అడగకుండా మీ ATM ఇవ్వండి అను అడుగుతున్నాను.. ఆయన "అదే ఇదివరకు మొగుడిని ఏమండి ఒక 500 ఇవ్వండి ఇవి కొనాలి, అవి కొనాలి అని చెప్పి అడిగేవాళ్ళు ఆడవాళ్ళు ఏకం గ ATM నే అడుగుతున్నావ్ నువ్వు ,,కాలం మారింది" అని అంటూ ఉంటారు..
జాగ్రత్త గ చూసుకుంటే ATM ఉన్నా కూడా మనం ఖర్చు అదుపు లో పెట్టుకోవచ్చు కాకపోతే కాస్త ఖర్చు పెట్టేముందు ఇది అవసరమా కాదా అని ఒక్క సారి అనుకుంటే చాలు..