Jan 8, 2012

మెదడు కు మేత

 మన శరీరం హుషారు గ పని చేస్తూ ఉండాలి అంటే మన కు తిండి ఎలా అవసరమో మన బుర్ర  కూడా పదును గా ఉండాలి అంటే మేత అంతే అవసరం..రోజు విధి గా మన కడుపు నింపుతున్నాము  కాని ఏనాడైనా మన బుర్ర కు మేత పెట్టామా మనం,,అందుకే మన బుర్ర అంత  షార్ప్ గ పనిచేయదు,,,పదును లేని కత్తి లాగ తాయారు అవుతుంది ,,,
ఈ విషయం ఈ మధ్యనే నాకు కూడా తెలిసింది,,2001  లో నేను డిగ్రీ(ఇంజనీరింగ్) లో చేరాను, మళ్ళీ  ఇప్పుడు 2011  లో పీజీ (M .Tech ) చేరాను,,,ఇంకా పెళ్లి అయ్యి,పిల్లలు పుట్టి బుర్ర మొద్దు బారిపోయాక  ఇంకా ఏమి చదువుతాము అనిపించింది నాకు,నా చుట్టూ ఉన్న బంధుజనం అందరు అదేమాట,,,కానీ పుస్తకాలు   దుమ్ము దులిపి సరదా గ చదువుదాము అని మొదలెట్టేటప్పటికి పర్వాలేదు చదువుతుంటే పాతవి కొద్దిగా గుర్తువస్తున్నాయే అనిపించింది,,,మాములుగానే మనకు నవలలు ,పుస్తకాలూ చదివే అలవాటు ఉంది కాబట్టి ఏకబిగిన రెండు మూడు గంటలు అయిన  కాసేపు అవలీలగా చదవగలుగుతున్నాను,,మనకు వయసు పెరిగినంత మాత్రాన మన బుర్ర చిన్నదేమీ అయిపోదు కదా,,ఏదో ఒకటి మనం చదువుతూ ఉంటె లేదా పేపర్ లలో ఉండే సుడోకు లేదా పదకేళి అలాంటివి చేస్తూ ఉంటె మనకే జ్ఞాపకశక్తి,ఆలోచన శక్తి  పెరుగుతుంది,,సరదాగా ఆదివారం అనుబంధం లో వేసే చిన్న చిన్న  puzzles అలాంటివి చేస్తూ ఉంటె ఒకటి కి నాలుగు విధాలు గ ఆలోచించే శక్తి పెరుగుతుంది,,మనకే కాదు పిల్లలకు అలవాటు చేసిన కుడా సరదాగా సమయం గడుస్తుంది,,,ఈ మధ్యనే ఒకసారి జయసింహ గారి ఇంటర్వ్యూ లో కూడా విన్నాను మన బ్రెయిన్ ను ఎలా వాడుకోవాలి,,ఎలా మలుచుకుంటే అది ఇంకా బాగా పనిచేస్తుంది,,ఇలాంటి విషయాల మీద అయన మూడు పుస్తకాలు కూడా ప్రచురించారు ట,,,ఎవరికైనా అలాంటి పుస్తకాల లింక్ తెలిసి ఉంటె కొంచెం నాకు కుడా లింక్ షేర్ చెయ్యండి,,
బుర్ర పెంచుకుంటే పెరుగుతుంది  కాబట్టి ఇవాల్టి నుండి మనం అందరం ఎంతో కొంత మన బుర్రలకు పదును పెడదాం,,,

3 comments:

  1. బాగుంది అక్క.. మంచి ఆలోచన :)

    ReplyDelete
  2. పెళ్ళయ్యి పిల్లలు పుట్టి ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ కూడా ఇంకా చదువు మీద ఉన్న జిజ్ఞాసతో చదువుకోవటం అభినందనీయం! మీ బుర్ర త్వరలోనే బాగా పడునేక్కాలని ఆశిస్తూ..........

    ReplyDelete
  3. యండమూరి రాసిన "భేతాళ ప్రశ్నలు" చదవండి. బుర్ర కొంచమైనా పదునెక్కటం ఖాయం.

    ReplyDelete