Sep 24, 2009

దసరా సెలవలోచ్చ్

రేపటినుండి అన్ని కాలేజీలకు,ఆఫీసులకు దసరా సెలవలు.. నేను కూడా మా అమ్మ వల్ల ఇంటికి వెళ్తున్నాను.. దసరా కదా అల్లుడిని ఇంటికి ఆహ్వానిస్తారు గా.. కొత్త అల్లుడు అయిన పాత అల్లుడు అయిన అల్లుడే గా... పుట్టింటికి వెళ్తున్నాం అంటే ఎంత ఆనందమో చెప్పలేము...దాదాపు పెళ్లి అయిన ప్రతి ఆడపిల్లకు ఇదే ఫీలింగ్ ఉంటుంది అనుకుంటున్నాను.. ... రెండు రోజులనుండే సర్దుడు మొదలు పెట్టేసాను... మా ఫ్రెండ్స్ అందరమూ కలుస్తాము దసరా సెలవలకు... మా బంధువుల ఇళ్ళకు అన్నిటికి తిరుగుతాము ...దసరా అంటే ౩ రోజులుసెలవలు కాబట్టి దాదాపు అందరు వస్తారు ఇళ్ళకు.. ఇంక ఇప్పుడే అందరమూ బంధువులం కలిసేది (ఉల్లోవాళ్ళు)... ఒక ఊరి లో కలిసి తిరిగిన వాళ్ళను అది బంధువులను కలవాలి అంటే దాదాపు ఒక ఏడాది పడ్తోంది ఈ రోజులలో.. ఒక్క రోజు పండగ శలవ కు వెల్ల లేము గ ఊరు.. అది వీకెండ్ కకబోతే ఇంక ఊరు వెళ్దాం అన్న ఆలోచనే రాదు మరి... అందుకే నాకు అన్ని పండగలకంటే దసరా ఇష్టం.. ఎక్కువ సంబరం చేసుకోకపోయినా కచ్చితంగా ఉరు వెళ్తాం గా ...

Sep 19, 2009

ఉరి తీయాలి

ఒక ఏడాది లోనే మహిళల ఫై ఈవిధం గ అకృత్యాలు మితిమీరిపోతున్నాయి అంటే చాలా విచారించ వలసిన విషయం. చట్టం గట్టి గ లేక పోవటం వల్లనే ఈ విధం గ మ్రుగాళ్ళు బలితెగిస్తున్నారు..మొట్టమొదటి సంఘటనా జరిగినప్పుడే శిక్ష గట్టిగ పడుంటే ఈ విధం గ ఇన్ని సంఘటనలు చోటు చేసుకుని ఉండేవి కావు..కోర్ట్ లో నేరం రుజువు కావాలి అంటేనే కొన్ని నెలలు పడ్తోంది. ఇంక తీర్పు వేలువదేటప్పటికి కొన్ని ఏళ్ళు గడుస్తున్నాయి ..తర్వాత జేవతఖైదు అంతేగా సిక్ష. అలాకాకుండా మహిళల పైన ఎదయన నేరం చేస్తే వరకట్నం కానీ,ప్రేమ పేరుతొ హింస కానీ, చేస్తే వెంటనే 10 రోజులలో శిక్ష అమలు జరిగేలా చూడాలి. అప్పుడు కానీ ఆడవారిని ఎమైన దాడి చేయాలి అంటే ఈ మ్రుగాళ్ళు దడుస్తారు.. లేకపోతె ఎప్పుడో కదా శిక్ష పడేది అని ముందు వెనక ఆలోచించకుండా మహిళను,కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు.. ఇక నుండి ఐన ఆడవారి ఫై హింసాత్మక చర్యలు తగ్గితే బాగుండు..

Sep 18, 2009

పండగ హడావుడి

ఇవ్వాల్టినుండి పండగ మొదలు.ఇంక గుడిలో హడావుడి మొదలు అవుతుంది.భక్తుల తో కిటకిట లాడుతాయి. మా ఇల్లు శివాలయం కు ఎదురుగ ఉంటుంది.ఇంటి మేడ ఫై నుండి చూస్తే గుడి కన్నుల పండుగ గ ఉంటుంది.సాయంత్రం పూట ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ నవరాత్రిల్లు బాగా సందడి సందడి గ ఉంటుంది మాకు..అన్నీ బాగానే ఉంటాయి కానీ పండగలు అప్పుడు గుడి లో మైక్ పెడ తారు అదీ పెద్ద సౌండ్ తో. ఉదయం నుండి రాత్రి 11 దాక ..మరీ ఎదురు అవ్వటం వల్లన మా ఇంట్లోనే మైక్ పెట్టారా అన్నట్లు ఉంటుంది ఆ సౌండ్.మేము మొదటి నుండి అదే మా సొంత ఇల్లు కావటాన అలవాటు పడిపోయాము. కానీ ఇప్పుడు మా బాబు (ఏడాదిన్నర వయస్సు) వాడికి అంత సౌండ్ ఉంటే చికాకు గ ఏడుస్తాడు.. పోనీ గుడిలో పూజారులు తెలిసినవాళ్ళే కదా చెప్పుదాం సౌండ్ తగ్గించండి అంటే 9 రోజులే కదండీ కొంచం adjust అవ్వండి అంటారు.. పోనిలే 9 రోజులే కదా అని అనుకోటానికి లేదు దసరా తర్వాత ఒక 10 రోజులకే కార్తీక మాసం ఉంటుంది గా.. శివునికి ఇష్టమైన మాసం దానికి తోడూ అయ్యప్ప దీక్షలు,పూజలు.. ఇంక భజన కార్యక్రమం ఉంటుంది గ ఇంక మైక్ సంగతి చెప్పేదేముంటుంది.. దాని తర్వాత ధనుర్మాసం సంక్రాతి దాక ఈ సందడి కొనసాగుతూనే ఉంటుంది...అంటే ఇంచుమించు ఒక ౩ నెలలు అన్నమాట.. చిన్నప్పుడు మేము ఎలా భరించామ ఇంత సౌండ్ అనిపిస్తుంది... కొంచం పెట్టుకుంటే పర్వాలేదు కనీ 4 స్పీకర్లు పెడతారు.. అది నలుదిక్కుల వినిపించాలి అని రోడ్డు వైపుకు కడతారు..ఇంక హోరేహోరు..
చక్కగా వినసొంపుగా తక్కువ సౌండ్ పెట్టుకుని కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది.. పెద్దవారికి(ముసలివారికి) ,చిన్నపిల్లల కు ఇబ్బంది కలగకూడదు కదా మన భక్తి వల్ల ..

Sep 14, 2009

Flue effect

రెండు రోజుల క్రితం నేను మా వాళ్ళ పిల్లలను హాస్పిటల్ లో చేర్చారు అంటే చూద్దాం అని వెళ్ళాను. ఎందుకు జాయిన్ చేసారు అంటే swine flue భయం వల్లన.పిల్లలకు గత ౩ రోజుల నుండి బాగా జలుబు,దగ్గు ఉన్నాయిట. సామాన్యం గానే జలుబు కు మందులు వాడితే 7 రోజులతో తగ్గుతుంది వేయకపోతే వారం లో తగ్గుతుంది అని నానుడు ఉంది కదా.. కొంచం జలుబు,దగ్గు ఉంటే చిన్న పిల్లలకు జ్వరం వస్తుంది కొద్ది గ.. ఇప్పుడు అస్సలే రాజధాని లో పరిస్థితి బాగోలేదు కదా ఒకసారి చెక్ అప్ చేసితే బాగుంటుంది అనుకోని పిల్లల హాస్పిటల్ (కార్పొరేట్ హాస్పిటల్,పేరు ఎందుకులెండి) కు తీసుకు వెళ్లారు. వాళ్ళు జలుబు,దగ్గు అని చెప్పగానే swine flue టెస్ట్ చేయించాలి అని admitt అవ్వమని చెప్పారు.అడ్వాన్సు 10000 రూపాయలు కట్టించుకున్నారు.రూం రెంట్ ౩౦౦౦ రూపాయలు ట.ఇంక టెస్టులకు,మందులకు ఆ బిల్లు వేరే ఇంక చెప్పే దేముంది..reports రేపు వస్తాయి అని ఒక రోజు మొత్తం ఉంచుకున్నారు..తీర reports లో చుస్తే అదృష్టవసాత్తు swine కాదు. ఏదో జలుబు తగ్గటానికి మందులు రాసి ఒక వారం చూద్దాం తగ్గకపోతే మళ్లీ తీసుకురండి అని పంపారు ట.... swine భయం కాదు కానీ బిల్ తడిసి మోపెడు అయింది .
అంతేలెండి పరిస్థితులు అలా ఉన్నాయి ఇప్పుడు...

Sep 13, 2009

అమ్మో ఆదివారం

దాదాపు గ ఆదివారం అంటే అందరికి ఉత్సాహం గ ఉంటుంది.కానీ నాకు అనిపిస్తుంది అన్ని వారాలకంటే ఆదివారమే చాల బిజీ గ ఉంటామేమో అనిపిస్తుంది అందులోను ఆడవాళ్లు.మాములు రోజుల లో ఐతే 9 గంటల కల్లా వంట అయిపోయి చాలా ఖాలీ గ ఉంటాము దాదాపు గ అన్ని కుటుంబాల వాళ్ళు. కానీ ఆదివారం మాత్రం ఇంట్లో అందరు (భర్తా,పిల్లలు) దాదాపు గ ఆలస్యం గ లేస్తారు..విడి రోజులలో పాపం అలసిపోతారు కదా అందుకని . ఆదివారం టిఫిన్స్ అయ్యేటప్పటికే 10 గంటలు అవుతుంది.ఇంక వంట కార్యక్రమం చేసి భోజనాలు పెట్టి మనం(ఆడవాళ్లు) తినేటప్పటికి దాదాపు గ 1.౩౦ అవుతుంది.ఇంక కాసేపు తిని నడుము వాలుడ్డం అనుకోటానికి ఉండదు..ఉదయం శ్రీవారు మార్కెట్ కు వెళ్లి తెచ్చే కూరలు అన్ని చక్కగ సర్దుకొని ఫ్రిజ్ లో పెట్టుకోవటం,వారానికి సరిపడా ఆయన వి,పిల్లలవి బట్టలు ఇస్త్రి చేయటం..(అస్సలే సరుకుల ధరలు పెరిగాయి ఇంక ప్రతి వారం ఇస్త్రి కు అన్నేసి వందలు ఏమి పెడతాం లే అని ఐరన్ బాక్స్ ఉంది కదా అని ఇలా ఆదివారం నేనే పని పెట్టుకున్న లెండి).. ఇవి అన్ని అయ్యేటప్పటికి సాయంత్రం 4 గంటలు అవుతుంది.మళ్లీ కాఫీ ల సెక్షన్ మొదలు అవుతుంది..సరే ఇంట్లో ఉంటారు కదా అని ఏదో పకోడీ నో,బజ్జి నో రోజు T.V ల లో చూసే కొత్త వంటకం చేసి పెట్టి మన ప్రయోగం సక్సెస్ అయింది అని చాల గర్వంగా ఫీల్ అవుతాం ..ఆదివారం కదా స్నేహితులో,బంధువులో చూడటానికి వస్తుంటారు లేదా మనమే ఎ పార్క్ కో,బంధువుల ఇల్లకో వెళ్తుంటాం... ఇంక రాత్రికి ఏదో ఒకటి తిని తిన్నాం అనిపించి పడుకునే ప్పటికి 10.౩౦ మామూలుగానే.... తీరా చుస్తే వారం ముందు నుండే T.V లలో ఓ ఏదో ఒక కొత్త సినిమా అని ad వేస్తుంటాడు...చూద్దాం అనుకుంటాం కానీ టైం నే ఉండదు.....ఆదివారం అంతా fullబిజీ గ గడిచిపోతుంది...
ఇనా మళ్లీ ఆదివారం ఎప్పుడొస్తుందా అనే ఎదురు చూస్తూ ఉంటాం ఎందుకంటే ఇంట్లో అందరు హయిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేది ఈ రోజే గ....
అందుకే మల్లి ఆదివారం కోసం ఎదురుచూస్తూ...

Sep 12, 2009

పండగల విశేషాలు

వ్యాఖ్యలు నేను ఒక పుస్తకం లో చదివాను.మన పండగలు ఆచారాలూ లో ఉన్నా గొప్పతనం అందరికి తెలియాలి అనిఇక్కడ పొందుపరుస్తున్నాను.
వినాయక చవితి నాడు ఉండ్రాళ్ళు ఒంటికి బలానిచ్చి దేహ శాంతి ని కలిగిస్తాయి.పిత్త దోషం పోగొడుతుంది అని వైద్యశాస్త్రం.
మసూచి వసంత ఋతువులో వస్తుంది కాబట్టి అది రాకుండా ఉండటానికి వేపపువ్వు తింటారు (ఉగాది పచ్చడి )
ధనుర్మాసం లో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువ ఉండడం వల్ల తగిన ఆహరం లేకపోతె రసాది ధాతువులునుఎండించి రోగాలు కలిగిస్తాయి .కనుక దద్దోజనం,చక్రపొంగలి మో!! నివేదన పెట్టి ఆరగిస్తారు
ఆషాడ మాసం నుండి జటరగ్ని మందం ఉంటుంది.కనుక చాతుర్మాస్య వ్రతాలూ చేసి ఆహరం లో అనేకనియమాలు పాటిస్తారు.
వర్ష ఋతువు లో భూమి యొక్క ఆవిరి చేత గాలి చెడి పోయి ఉంటుంది.కనుక అటువంటి గాలిని పీల్చడం వల్ల రోగాలుపుడతాయి కనుక లక్క,పసుపు,అతివాస మొదలైన విషాన్ని పోగొట్టే ద్రవ్యాలను నిప్పు మీద వేసి పుట్టిన పొగచేవాతావరణాన్ని శుభ్రం చేయాలి అన్నారు.దీపావళి లో బాణసంచా కూడా అందుకే.
ఉగాది లో మామిడి,నేరేడు,మేడి,జువ్వి వీటి ఆకులను నానిపి తలంటు స్నానం చేయాలి అని ఆయుర్వేద గ్రంధాలుఅంటున్నాయి.రధ సప్తమి నాడు జిల్లేడు ఆకులను తల ఫై పెట్టి స్నానం చేయడం వడదెబ్బ నుండి రక్షించడానికే.
మకర సంక్రాంతి లో నువ్వుల ఉండలు తినడం వల్ల వాతం హరిస్తుంది.హృదయ స్పందనకి నువ్వులు,బెల్లంఉపకరిస్తాయి.
రాత్రివేళల్లో భూగర్భ జల లలో శక్తిమంతము ఐన అయస్కాంత మండలం ఉంటుంది కనుక కార్తీక మసాల లోతెల్లవారు జామున స్నానాలు చేయాలి అన్నారు.
అట్లతద్ది నాడు గోరింట పెట్టుకోవడం వల్ల చేతులకు,కాళ్ళకు చర్మ రోగాలు రావు.
మామిడాకు తోరణాలు చెడు గాలిని హరిస్తుంది అందుకే పండగ నాడు మామిడి తోరణాలు గుమ్మానికి కడతాము.

ఇవి మన పండగల లో ఉన్న ముఖ్య ఉద్దేశం.పండగ అంటే ఏదో సెలవు దినం అనే కాకుండా కాస్త ఆచారం కూడా పాటిస్తేపండగ సార్ధకమవుతుంది.



Sep 7, 2009

మీడియా అత్యుత్సాహం

మన మీడియా వాళ్ళు మరీ అతి ఉత్సాహం ప్రదర్శిస్తారు.Y.S.R హెలికాప్టర్ కనిపించనప్పటి నుండి అయన అంత్యక్రియలు వరకు లైవ్ దానికి తోడూ చర్చలు.క్లోజ్ అప్ లో ప్రజల భావాలను ప్రదర్శించడం. హెలికాప్టర్ కనపడలేదు అని ఒక 4 గంటలు హడావుడి చేసారు తర్వాత ఎక్కడో నల్ల మల అడవిలో ఉన్నది అని అదొక ప్రచారం ఇంతా కనిపెట్టే టప్పటికి తెల్లారిపోయింది.. ఈ లోగ చూసే జనానికి రాత్రి అంతా నిద్ర పట్టదు.టీవీ చూద్దాం అనుకున్నా టెన్షన్ నే చూడక పోయిన ఏమి అయిందో అని టెన్షన్.. ఈ లోగ చూస్తూ చూస్తూ కన్ను కునుకు పట్టేసరికి తెల్లారిపోయింది ఇంక 8 గంటలకు హెలికాప్టర్ ఆచూకి దొరికింది ఇంక అక్కడకు చేరాలి అంటే ఒక గంట సమయం పడ్తుంది.అక్కడి వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు..అని అదొక సస్పెన్షన్.. ఈలోగా మనం టెన్షన్ తో ప్రార్ధనలు..ఇన ఏమి లాభం పాపం వై.స.ర బృందం పాపం పోయారు..ఈ వార్త తెలిసే లోగ ఒక 50 మంది పోయారు మన రాష్ట్రం లో..ఏమి చేస్తారు గుండె నిబ్బరం లేని వాళ్ళు అంత సేపు టీవీ లో చుస్తే ..ఇంక అక్కడ నుండి అంత్యక్రియలు దాక లైవ్. దాదాపు ఒక రోజు అంతా పట్టింది ఈ లోగ మన అభిమానుల మృతి సెంచరీ దాటేసింది.. ఇంక ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అని అదొక చర్చ..అవకపోతే ఆత్మహత్యా చేసుకుంటాం అని బెదిరింపులు ..
ఇది అంతా మీడియా ముందు హడావుడి చేయటం కోసమే అభిమానుల ఆరాటం అని అనిపిస్తుంది. ఈ చానల్స్ వాళ్ళు కూడా వల్ల ratings పెంచుకోవటం కోసం లైవ్ టెలికాస్ట్ లు వీపరీతం గ చేస్తున్నారు..
ఎప్పటికి మారతారో ఈ జనాలు

Sep 3, 2009

రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి

C.M మరణ వార్త వచ్చి రాగానే రాజకీయ నాయకులలో చర్చ మొదలు అయ్యింది.తర్వాత మంత్రి ఎవ్వరు అవ్వాలి అని.చాలా మంది ఏకగ్రీవంగా Y.S.R. తనయుడు జగన్ మోహన్ రెడ్డి నే కావాలి అని కోరుతున్నారు మంత్రులు.కాంగ్రెస్ ను మళ్లీ పటిష్టం చేయాలి అంటే యువ నాయకుడు తప్పని సరిగా కావాలి.కానీ జగన్ ప్రత్యక్ష రాజకీయాల లోకి వచ్చింది ఇప్పుడే కదా అంత అనుభవం ఉండదు కదా కాబట్టి మంచి గ అలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది..రాజకీయ క్రియాశీలత,ఆలోచనా శక్తీ బట్టి తీసుకోవాలి కాని వారసత్వం గ ,Y.S.మీద ప్రేమ తో నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుంటుంది.అప్పటి దాకా వేచి ఉండాల్సిందే.
జోహార్ Y.S.R
జోహార్ Y.S.R