Jan 8, 2012

మెదడు కు మేత

 మన శరీరం హుషారు గ పని చేస్తూ ఉండాలి అంటే మన కు తిండి ఎలా అవసరమో మన బుర్ర  కూడా పదును గా ఉండాలి అంటే మేత అంతే అవసరం..రోజు విధి గా మన కడుపు నింపుతున్నాము  కాని ఏనాడైనా మన బుర్ర కు మేత పెట్టామా మనం,,అందుకే మన బుర్ర అంత  షార్ప్ గ పనిచేయదు,,,పదును లేని కత్తి లాగ తాయారు అవుతుంది ,,,
ఈ విషయం ఈ మధ్యనే నాకు కూడా తెలిసింది,,2001  లో నేను డిగ్రీ(ఇంజనీరింగ్) లో చేరాను, మళ్ళీ  ఇప్పుడు 2011  లో పీజీ (M .Tech ) చేరాను,,,ఇంకా పెళ్లి అయ్యి,పిల్లలు పుట్టి బుర్ర మొద్దు బారిపోయాక  ఇంకా ఏమి చదువుతాము అనిపించింది నాకు,నా చుట్టూ ఉన్న బంధుజనం అందరు అదేమాట,,,కానీ పుస్తకాలు   దుమ్ము దులిపి సరదా గ చదువుదాము అని మొదలెట్టేటప్పటికి పర్వాలేదు చదువుతుంటే పాతవి కొద్దిగా గుర్తువస్తున్నాయే అనిపించింది,,,మాములుగానే మనకు నవలలు ,పుస్తకాలూ చదివే అలవాటు ఉంది కాబట్టి ఏకబిగిన రెండు మూడు గంటలు అయిన  కాసేపు అవలీలగా చదవగలుగుతున్నాను,,మనకు వయసు పెరిగినంత మాత్రాన మన బుర్ర చిన్నదేమీ అయిపోదు కదా,,ఏదో ఒకటి మనం చదువుతూ ఉంటె లేదా పేపర్ లలో ఉండే సుడోకు లేదా పదకేళి అలాంటివి చేస్తూ ఉంటె మనకే జ్ఞాపకశక్తి,ఆలోచన శక్తి  పెరుగుతుంది,,సరదాగా ఆదివారం అనుబంధం లో వేసే చిన్న చిన్న  puzzles అలాంటివి చేస్తూ ఉంటె ఒకటి కి నాలుగు విధాలు గ ఆలోచించే శక్తి పెరుగుతుంది,,మనకే కాదు పిల్లలకు అలవాటు చేసిన కుడా సరదాగా సమయం గడుస్తుంది,,,ఈ మధ్యనే ఒకసారి జయసింహ గారి ఇంటర్వ్యూ లో కూడా విన్నాను మన బ్రెయిన్ ను ఎలా వాడుకోవాలి,,ఎలా మలుచుకుంటే అది ఇంకా బాగా పనిచేస్తుంది,,ఇలాంటి విషయాల మీద అయన మూడు పుస్తకాలు కూడా ప్రచురించారు ట,,,ఎవరికైనా అలాంటి పుస్తకాల లింక్ తెలిసి ఉంటె కొంచెం నాకు కుడా లింక్ షేర్ చెయ్యండి,,
బుర్ర పెంచుకుంటే పెరుగుతుంది  కాబట్టి ఇవాల్టి నుండి మనం అందరం ఎంతో కొంత మన బుర్రలకు పదును పెడదాం,,,

Jan 7, 2012

Road Train



మామూలు గ మనం ట్రైన్స్ అంటే పట్టాల మీదనే వెళ్తాయి అని అనుకుంటాం కదా,,కానీ austraila  లో రోడ్ మీద వెళ్ళే ట్రైన్స్ ఉన్నాయి,,,ఈ ఫోటో లు నేను ఒక వెబ్సైటు లో చూసాను,,,మీరు కూడా చుడండి,,
(రోడ్ ట్రైన్ అంటే మాములు truck  లాంటిదే కాకపోతే మనం truck  అంటే ఒకటి లేదా రెండు trailers  ను లాగేవాటిని   truck  అంటాం కానీ అంతకంటే ఎక్కువ trailers  ను లాగేవాటిని రోడ్ ట్రైన్స్ అంటారు,,
వీటిని ఆస్త్రైలియా,aurgentina ,మెక్షికొ లలో  remote  areas  లో ఉపయోగిస్తారు, వికీపీడియా నుండి సేకరించా వివరణ )