Dec 9, 2012

బాబోయ్ బడి

నిన్నటి ఈనాడు పేపర్ చుస్తే నిజంగానే ఇప్పటి స్కూల్స్ ను చూస్తుంటే మనకే  బాబోయ్  బడి అని అనిపిస్తుంది,,,ఇంకా Pre.KG(UKG,LKG) పిల్లల స్థితి చెప్పనే అక్కరలేదు,,,మా వాడు చదివేది UKG వాడికి ఇప్పుడు ప్లే టైం లేదు ట  వాడికి ఎందుకంటే సిలబస్ అవ్వటం లేదు అని వాళ్ళు ఆడుకునే ఆ కాసేపు కూడా తెసేసారు,,,,extra క్లాస్సులు  ట  ,,,మా అమ్మ అంటుండేది నాలుగేళ్ళకి నువ్వు ఇంకా బడి లో కూడా చేరలేదే వాడిని హోంవర్క్ అని హింసిస్తావెందుకు అడుకోనియక అని,,,
బోర్డు మీద రాసింది వీళ్ళు వెంటనే చూసి రాసుకోవటం లేదు ట ,,,5 నిముషాలలో మొత్తం రాయాలిట టీచర్ బోర్డు మీద రాసిన మొత్తం పాటం ,, మీ అమ్మాయి అల చేయటం లేదు అని ఒక తల్లిదండ్రుల తో ప్రిన్సిపాల్ కంప్లైంట్ పేరెంట్స్ మీటింగ్ లో,,,మా  వాడికి బ గ్రేడ్ వచిందండి మీ వాడికి వచ్చిన   గ్రేడ్ ఏంటి అని పేరెంట్స్ టెన్షన్ ,,ప్రోగ్రెస్ రిపోర్టులు ,పేరెంట్స్ మీటింగ్ లు అంటే పిల్లల కంటే తల్లిదండ్రులకు భయం గ ఉంది ముందు,,,ఆ వయసు పిల్లల రాంకుల మీద కూడా హై expectations,,,
ఈ వయసు నుండే ప్రాజెక్ట్ వర్క్స్,,ఏమి చేయాలో అర్ధం కాక ఉదయం నుండి సాయంత్రం దాక గూగుల్ లో పడి  వెతకట మే తల్లిదండ్రుల పని,,,
మా వాడికి మరీ విచిత్రం వీడికి కూడా టర్మ్స్ అట అంటే  ఇంజనీరింగ్ లో ఉన్నట్టు సెమిస్టర్ సిస్టం,,,ఫస్ట్ టరం లో కొంత సిలబస్ సెకండ్ టర్మ్ లో కొంత,,ఇప్పుడు సెకండ్ టర్మ్,, పాతవి మర్చిపోతున్నాడండి అంటే అది అయిపోయిందండి ఫస్ట్ టరం లో ఇప్పుడు చెప్పం ఇంక సెకండ్ టర్మ్ మీద concentrate చేయండి మీరు కూడా అని హితవు,,,, మొదటి 100 నంబర్స్ మర్చిపోయి 100 నుండి 200 గుర్తుంటే ఉపయోగం ఏముంది,,,మర్చిపోకుండా ఉండాలి అంటే ఇంట్లో ఇంక మీరు చెప్పుకోట మే  అంటుంది,,,పిల్లల కంటే తల్లిదండ్రుల కు పరీక్ష లా ఉంది ఈ కాలం పిల్లల చదువులు ,,
మన తల్లిదండ్రుల ఆలోచన మారనంత కాలం ఈ విద్యా వ్యవస్థ మారదు ,,,
http://eenadu.net/Magzines/SundaySpecialInner.aspx?qry=weekpanel1

Mar 22, 2012

ఆనంద నందనం







                                                        తీపి,చేదు కలిసిందే జీవితం
                                                        కష్టం,సుఖం ఉంటాయి అని గుర్తుచేస్తూ
                                                        మన జీవితం లో అనంద మకరందాలను
                                                         పూయించేందుకే వస్తోంది ఈ నందన నామ సంవత్సరం!!!!

                                              కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ
                                                  అందరికీ గాది శుభాకాంక్షలు 

Jan 8, 2012

మెదడు కు మేత

 మన శరీరం హుషారు గ పని చేస్తూ ఉండాలి అంటే మన కు తిండి ఎలా అవసరమో మన బుర్ర  కూడా పదును గా ఉండాలి అంటే మేత అంతే అవసరం..రోజు విధి గా మన కడుపు నింపుతున్నాము  కాని ఏనాడైనా మన బుర్ర కు మేత పెట్టామా మనం,,అందుకే మన బుర్ర అంత  షార్ప్ గ పనిచేయదు,,,పదును లేని కత్తి లాగ తాయారు అవుతుంది ,,,
ఈ విషయం ఈ మధ్యనే నాకు కూడా తెలిసింది,,2001  లో నేను డిగ్రీ(ఇంజనీరింగ్) లో చేరాను, మళ్ళీ  ఇప్పుడు 2011  లో పీజీ (M .Tech ) చేరాను,,,ఇంకా పెళ్లి అయ్యి,పిల్లలు పుట్టి బుర్ర మొద్దు బారిపోయాక  ఇంకా ఏమి చదువుతాము అనిపించింది నాకు,నా చుట్టూ ఉన్న బంధుజనం అందరు అదేమాట,,,కానీ పుస్తకాలు   దుమ్ము దులిపి సరదా గ చదువుదాము అని మొదలెట్టేటప్పటికి పర్వాలేదు చదువుతుంటే పాతవి కొద్దిగా గుర్తువస్తున్నాయే అనిపించింది,,,మాములుగానే మనకు నవలలు ,పుస్తకాలూ చదివే అలవాటు ఉంది కాబట్టి ఏకబిగిన రెండు మూడు గంటలు అయిన  కాసేపు అవలీలగా చదవగలుగుతున్నాను,,మనకు వయసు పెరిగినంత మాత్రాన మన బుర్ర చిన్నదేమీ అయిపోదు కదా,,ఏదో ఒకటి మనం చదువుతూ ఉంటె లేదా పేపర్ లలో ఉండే సుడోకు లేదా పదకేళి అలాంటివి చేస్తూ ఉంటె మనకే జ్ఞాపకశక్తి,ఆలోచన శక్తి  పెరుగుతుంది,,సరదాగా ఆదివారం అనుబంధం లో వేసే చిన్న చిన్న  puzzles అలాంటివి చేస్తూ ఉంటె ఒకటి కి నాలుగు విధాలు గ ఆలోచించే శక్తి పెరుగుతుంది,,మనకే కాదు పిల్లలకు అలవాటు చేసిన కుడా సరదాగా సమయం గడుస్తుంది,,,ఈ మధ్యనే ఒకసారి జయసింహ గారి ఇంటర్వ్యూ లో కూడా విన్నాను మన బ్రెయిన్ ను ఎలా వాడుకోవాలి,,ఎలా మలుచుకుంటే అది ఇంకా బాగా పనిచేస్తుంది,,ఇలాంటి విషయాల మీద అయన మూడు పుస్తకాలు కూడా ప్రచురించారు ట,,,ఎవరికైనా అలాంటి పుస్తకాల లింక్ తెలిసి ఉంటె కొంచెం నాకు కుడా లింక్ షేర్ చెయ్యండి,,
బుర్ర పెంచుకుంటే పెరుగుతుంది  కాబట్టి ఇవాల్టి నుండి మనం అందరం ఎంతో కొంత మన బుర్రలకు పదును పెడదాం,,,

Jan 7, 2012

Road Train



మామూలు గ మనం ట్రైన్స్ అంటే పట్టాల మీదనే వెళ్తాయి అని అనుకుంటాం కదా,,కానీ austraila  లో రోడ్ మీద వెళ్ళే ట్రైన్స్ ఉన్నాయి,,,ఈ ఫోటో లు నేను ఒక వెబ్సైటు లో చూసాను,,,మీరు కూడా చుడండి,,
(రోడ్ ట్రైన్ అంటే మాములు truck  లాంటిదే కాకపోతే మనం truck  అంటే ఒకటి లేదా రెండు trailers  ను లాగేవాటిని   truck  అంటాం కానీ అంతకంటే ఎక్కువ trailers  ను లాగేవాటిని రోడ్ ట్రైన్స్ అంటారు,,
వీటిని ఆస్త్రైలియా,aurgentina ,మెక్షికొ లలో  remote  areas  లో ఉపయోగిస్తారు, వికీపీడియా నుండి సేకరించా వివరణ )