Dec 27, 2011

దక్షిణ

పూజలు,వ్రతాలూ  చేసినప్పుడు తాంబూలం ఇచ్చేటప్పుడు మనం అందులో దక్షిణ పెడతాం.దక్షిణ అనేది బ్రాహ్మణుని కోసమే ,ఆయనే తీసుకోవటానికి  దక్షిణ అని పేరు చెప్పి మన దగ్గర వసూలు చేస్తారేమో అని అనుకున్నాను  నేను ,,కానీ ఈ మధ్యనే  దేవి భాగవతం లో చదివేటప్పటికి తెలిసింది,,దక్షిణ అనేది కూడా ఒక దేవత రూపమే అని,దక్షిణ లేని పూజ ఫలించదని ,,ఆ కధా మీరు కూడా చదవండి,,,


పూర్వము గోలోకము లో సుశీల అనే గోపిక ఉన్నది.ఆమె  శ్రీహరి కి అత్యంత ప్రియురాలు.రాధ కు స్నేహితురాలు.విద్యా గుణవతి అయిన యువతి.ఒకనాడు ఆ సుశీల రాధ చూచుచుండగా  శ్రీకృష్ణుని ఎడమ భాగమున నిలుచుండెను.అప్పుడు గోపికలందరిలో అందెవేసిన చేయి అయిన రాధ తన ఎదురుగ ఉండుట చూసి శ్రీకృష్ణుడు భయముతో తల వంచుకొనెను.రాధ ఆ దృశ్యము చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది..అది చూసి శ్రీ కృష్ణుడు అంతర్ధానం అయ్యాడు.శ్రీకృష్ణుడు అంతర్ధానం అవటం చూసి సుశీల,మిగత గోపికలు భయపడిపోయారు.వారందరూ కృష్ణున్ని ప్రార్ధించారు..సుశీల పారిపోయింది,,సుశీల పారిపోవుట,శ్రీకృష్ణుడు కనిపించక పోవుట తెలుసుకొని రాధ సుశీల ను శపించింది,,ఇక నుండి గోలోకము లో కాలు పెట్టరాదు,పెట్టిన భస్మము అవుదువు గాక అని.రాధ శ్రీ కృష్ణుని దర్శనము ఇమ్మని ప్రార్ధించింది,,కాని శ్రీకృష్ణుడు రాధ ముందు కనిపించలేదు.
చాలా సంవత్సరాలు సుశీల తపస్సు చేసి లక్ష్మి దేవి శరీరము లో ప్రవేశించినది.
తరువాత దేవతల అందరూ అనేక యజ్ఞములు చేసారు.కనీ వారు ఆ యజ్ఞముల ఫలమును అనుభవింప లేకుండిరి.అప్పుడు వారు అందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్లి మొర పెట్టుకున్నారు.బ్రహ్మ కొంత కాలము తన మనస్సులో విష్ణు మూర్తి ని ధ్యానించి సమాధానము పొందారు.దాని ఫలితము గా నారాయణుడు మహాలక్ష్మి శరీరము నుండి ఒక దేవి పుట్టించి ఆమెను బ్రహ్మ కు సమర్పించారు.ఆ దేవి లక్ష్మి కు దక్షిణ భాగము నుండి జనించుట చే ఆమెకు దక్షిణ అనే పేరు వచ్చింది. యజ్ఞ భావనుడు దక్షిణ ను తన భార్య గా చేసుకొనెను.దక్షిణ పన్నెండు సంవత్సరాలు గర్భము ధరించి ఒక పుత్రుని కనెను అతని పేరు "ఫలము" .ఈతడు కర్మలను సక్రమముగా పూర్తి చేసిన వారికీ ఫలములను ఇచ్చును.యజ్ఞుడు,దక్షిణా పత్నితో పుత్రఫలముతో కర్మిష్టు లకు ఫలము ఒసగుచుండును.అప్పుడు దేవతలు అందరూ సంతోషించి తమ తమ నివాసములకు వెళ్లారు.
కర్త అగు వాడు తన కార్యము పూర్తి అయిన వెంటనే బ్రాహ్మణులకు దక్షిణ ఈయవలెను.అప్పటికప్పుడే కర్త కు ఫలము సిద్దిస్తుంది.దక్షిణ ఈయనిచో చేసిన పుణ్యము అంతయు బూడిద లో పోసిన పన్నీరు అగును..

Dec 11, 2011

మనసున్న మారాజు

సమయము సాయంత్రం అయిదు గంటలు.పార్కు లో అటు ఇటు అసహనం గా తిరుగుతూ ఉన్నాడు శ్రీను.ఇంత సేపా ఎప్పుడనగా వస్తానన్నావ్ అంటూ చిందులు తొక్కాడు అప్పుడే అక్కడకు వచ్చిన దీప్తి తో....దీప్తి,శ్రీను లకు ఒకరంటే ఒకరికి ప్రేమ..రెండు రోజుల క్రితమే పెళ్లి ప్రస్తావన తెచ్చాడు  శ్రీను..ఆలోచించుకుని అభిప్రాయము చెప్పమని సమయం కూడా ఇచ్చాడు దీప్తి కు ..
ఇంతకీ ఏమని నిర్ణయించుకున్నావ్..ఇంట్లో వాళ్ల అనుమతి తో చేసుకుందామని నా లేక ఎక్కడి కైనా వెళ్ళిపోయి చేసుకుందామా ,అని సూటి గా ప్రశ్నించాడు శ్రీను . ప్లీజ్
ఇంకా ఎవరినైనా పెళ్లి చేసుకొని హ్యాపీ గా ఉండు,,మనం మంచి స్నేహితులు గానే ఉందాం,,మన పెళ్లి మీ పెద్దలు,మా పెద్దలు ఇద్దరు ఒప్పుకోరు,,ఈ సమాజం కూడా ఒప్పుకోదు..నన్ను అందరూ చులకన గా చూస్తారు..అంటూ బాధ గా కంట తడి పెట్టింది దీప్తి..ఎవరో ఏదో అనుకుంటారు అని నా మనసు ని కష్ట పెట్టుకోమంటావా,,నేను మొదటి సారి నిన్ను చూసినప్పుడే నిన్ను ఇష్టపడ్డాను,,అప్పుడు నీకు పెళ్లి అయిందని నాకు తెలియదు,,,తర్వాత తెలిసింది స్నేహితుల ద్వారా నీకు పెళ్లి అయ్యి భర్త నాలుగు రోజుల లోనే రోడ్ ఆక్సిడెంట్ లో మరణించాడు అని...అది ఏదో విధివశాత్తు జరిగిన ఘటన...ఆ విషయం తెలిసినాక కూడా నా లో నీ పై ఉన్న  ప్రేమ ఏమి మారలేదు,,ఇంకా ఇష్టం పెరిగింది..నీ కాళ్ళ మీద నీవు నిలబడేందుకు ఆ ఘటన నుండి మనసు మళ్ళి ఇంచుకునేందుకు  నువ్వు చక్కగా ఉద్యోగం కూడా చేసుకుంటున్నావ్  ,,ఆ పాత  గాయం నే గుర్తు చేసుకుంటూ జీవితాన్ని ముగించేస్తావా ,,,ఇంటిలో  వాళ్ళను ఒప్పించు మనం ఇద్దరం పెళ్లి చేసుకుని హయిగా ఉందాం...అని ఒప్పించ చూసాడు దీప్తి ని...ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా ఈ ఊరిలో  వాళ్ళు నవ్వుతారు శ్రీను....ఏవో సినిమాల వరకే పరిమితం అలాంటి సామజిక వివాహాలు మన పల్లెటూరి లో అలాంటివి సాధ్యం కావు,,,అందరిని ఎదిరించి మనం మాత్రం ఎలా సుఖం గా ఉండగలం,,ఇలాగే ఉండాలి అని నా జీవితం రాసిపెట్టి ఉన్నట్టుంది ...నా వలన నువ్వు ఇబ్బందులు పడటం నాకు ఇష్టం లేదు,, పెద్దవాళ్ళను ఒప్పించగలిగితే  అప్పుడు చూద్దాం  అని చెప్పి అక్కడినుండి ఏడుస్తూ వెళ్ళిపోయింది దీప్తి..
తరువాత ఇరువురి ఇళ్ళల్లోను ఒప్పించటానికి చాలా ప్రయత్నాలే చేసాడు శ్రీను,,,మనసులో ఒప్పుకోవాలి అని ఉన్నా  బంధువులు,చుట్టూ పక్కల వాళ్ళు,సమాజం ఏమంటుందో అన్న భయం తో ఇరువురు తల్లిదండ్రులు ఈ పెళ్ళికి అంగీకరించలేదు...స్నేహితుల సహాయం తో దీప్తి ని ఒప్పించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు శ్రీను
 టీవీ వాళ్ళు,పేపర్ వాళ్లు..శ్రీను ఔదార్యాన్ని ఎంతో మెచ్చుకున్నారు,,,ఆ రోజూ అంతా టీవీ లలోను,ఊరి  లొనూ అందరూ శ్రీను ను పొగుడుతూ ఉంటే శ్రీను తల్లిదండ్రులు ఎంతో బాధ పడ్డారు...కన్న కొడుకు మనసుని అతని ఔన్నత్యాన్ని గ్రహించాలేకపోయమే..ఎవరో అనుకుంటారు అని ఇరువురి మనసులు నొప్పించామే,,అయినా వాడు చేసిన పని లో తప్పు ఏమి లేదే ఒక మనిషి కి జీవితాన్ని ఇచ్చాడు,,,వాడి  ప్రేమను గెలుచుకున్నాడు,,అనవసరం గా పంతానికి వెళ్ళాం  అని బాధపడి మనసార నూతన వధువరులను దీవించి తమ ఇంటికి స్వాగతించారు...మగవాళ్ళ లో మృగాళ్ళే కాదు..మనసున్న మగవాళ్ళు కూడా ఉన్నారు అని నిరూపించాడు శ్రీను...
------------------------------------------------------------------------------------------------------------------------
ఇది నా ఉహా కధా కానే కాదు,,,నిజం గా ఈ విధం గా పెళ్లి చేసుకున్న జంట ఉన్నారు  మా ఊరిలో ,,,పేరులు అవే పెట్టటం బాగుండదు అని పేర్లు మార్చాను,,,ఎప్పుడో ఆరునెలల క్రితం జరిగిన విషయం...రాద్దాం అనుకున్నా కాని ఇప్పటిదాకా కుదరనే లేదు,,,ఆడవాళ్ళ మీద ఆసిడ్ పోసే క్రూరులు ఉన్నారు,,,మంచి గా అర్ధం చేసుకుని జీవితాన్ని ఇచ్చే మగ వాళ్ళు ఉన్నారు,,,మన మీడియా కూడా మంచి చేసే వాళ్ళను ఏనాడు ప్రోత్సహించదు,,అలాంటి వాళ్ళను నలుగురిని చూపించి వాళ్ల గురించి చెప్పినా కొంత అన్నా మార్పు వస్తుంది సమాజం లో,,మన ఆలోచన ధోరణిలో..