Jan 19, 2011

వంటిల్లు

నేను:అంతా  మీరే  చేసారు,మొత్తం మీరే చేసారు..
చాలు అండి,పెళ్లి అయినప్పటి నుండి మీరు నా చేత చేయించింది చాలు,నేను కోల్పోయింది చాలు..ఇంకా ఒద్దండి ప్లీజ్.
శ్రీవారు:నేనా నేనేమి చేసాను??
నేను: మీరు ఎప్పుడూ నా చేత మీకు ఇష్టమైన కూరలే చేయించేవారు..అది కూడా మీకు ఇష్టమైన రీతిలో..ఆ కూర నాకు అస్సలు ఇష్టముందో లేదో కూడా అడగరు..నేను తింటానో లేదో కూడా తెలియదు మీకు.
శ్రీవారు:నీకు ఇష్టం లేదని చెప్పొచ్చు గా,,నీకు నచ్చిన వంట నే చేయొచ్చు గా
నేను:నేను ఇవ్వాళ ఇది చేద్దాం అని ఎంతగానో అనుకుంటాను...ఈ కూర ఇలా కాదు అలా చెయ్యి అంటారు.నేను గుత్తివంకాయ కూర చేద్దాం అని అనుకుంటాను ఇంతలో మీరు వచ్చి ఇది కూరల్లో పొడి వేసి చెయ్యి అంటారు...సరే అలాగే చేద్దాం అనుకుంటాను నేను.ఇంతలో వచ్చి ఇందులో ఈ పప్పులు ఆ పప్పులు కలిపి పొడి చేసి వెయ్యి అంటారు..
నేనేదో పుల్కాలు చేద్దాం అనుకుంటాను మీరేమో పూరి కావాలి అంటారు,,
నాకు గట్టిగ అరవాలి అనిపిస్తుంది నేను ఇలాగె చేస్తాను..అలా రుచి బాగుండదు,,ఆరోగ్యము కూడా కాదు అని...
కానీ మీకు ఇష్టము కదా ఇలా చేస్తే అని కేవలం మిమ్మల్ని గెలిపించటానికి ప్రతిపూట  నేను ఓడిపోతూనే ఉన్నాను..
ఇలాగే ఓడిపోతూ ఉంటే ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే నాకు ఏ వంటా పూర్తీ గా రాలేదు అని అనిపిస్తోంది.
ఇన్నాళ్ళు నేను వంట చేస్తున్నాను అనుకుంటున్నాను..కాని చెయ్యట్లేదు మీరే  చేయిస్తున్నారు...ఇకముందు కూడా ఇలాగే ఉంటాను...
కానీ నాదొక్క రిక్వెస్ట్..నేను చేసిన వంట రుచి అమ్మ చేతి వంట రుచి లాగానో,హోటల్ లో ని రుచి లాగానో ఉండాలి అని కోరుకోవద్దండి  PLZ ..


    ***************************************************************************************
హాహా ఏంటి ఇంత సీరియస్ గా రాసింది అనుకుంటున్నారా?? ఇవ్వాళ గుత్తి వంకాయ కూర చేద్దాం అనుకున్నాను,,మా వారు వచ్చి కూరల్లో పొడి వేసి చెయ్యి అన్నారు,అప్పుడు నాకు అనుకోకుండా బొమ్మరిల్లు cinedialogues గుర్తు వచ్చాయి...
సినిమాలో dialogues బానే ఉన్నాయి గాని..ఒక్కోసారి అరె మనకు అనిపించింది చేయలేకపోతున్నామే అని అనిపించక మానదు ఏ situation లో అయిన...అందుకే సరదాగా రాసా ఇది...అందుకే బొమ్మరిల్లు బదులు టైటిల్ వంటిల్లు అని పెట్టా..

 

7 comments:

  1. :):) .. bagundi vadina ee blog.. well correlated.. annayya thappakunda chadivela chudu mari

    ReplyDelete
  2. Baagundi...vadinaa..
    mari maaku kooda kaavali gutti vankaya koora.. :)

    ReplyDelete
  3. avunu, ela chesina memu tintam; annayya ki cheppandi, tammullu ila antunnaru ani :)

    ReplyDelete
  4. చాలా బాగా వ్రాసారు. మీరు కాబట్టి ఊరుకున్నారు. ముందు ముందు మీ పిల్లలు ఊరుకోరు కదండి. దయచేసి నా బ్లాగు చూడండి. http://madhudairymilk.blogspot.com/

    ReplyDelete