Jul 9, 2011

చిల్లర

రెండు రొజుల క్రితం నేను  మాకు దగ్గర లొ ఉన్న గుడి కి వెళ్ళాను..
గుడి  బయట  కూర్చునే  యాచకులకు  చిల్లర  వేద్దాం  అని  ముందే  కొంత  చిల్లర  తీసుకుని  వెళ్ళాను.దర్సనం అయిపోయినాక ఒక ఇద్దరికీ చిల్లర వేసాను.పది పైసల్లు,ఇరవై పైసల కాలం ఎప్పుడో పోయింది కదా..అందులోను ఈ మధ్యే పావలా కూడా అధికారికం గా పోయింది..government ఇప్పుడు announse చేసింది కానీ నాకు తెలిసి అయిదు ఆరేళ్ళ క్రితమే పావలా పరువు పోయింది,,అప్పట్లోనే పావలా ను ఎవ్వరూ తీసుకునేవారు  కాదు,,అందుకని కొన్ని అర్ధ రూపాయి బిళ్ళలు ఉంటే వాటిని ఇప్పుడే ఖర్చు చేద్దాం తొందరలో దానికి కూడా వేల్యూ పోతుంది అని ఏవో నా దగ్గర ఉన్న నాలుగయిదు అర్ధరూపాయలు కొన్ని రూపాయి బిళ్ళలు తీసుకుని  వెళ్ళా  గుడి కి,,,మొదటి ఇద్దరికీ అర్ధ రూపాయి వేసేసరికి ఇదేంటి  అమ్మ  ఇది చెల్లదు కదా అని ఒకేసారి అన్నారు వాళ్ళు..రెండు రూపాయలు ఉంటే వేయండి అమ్మ  అని అన్నది వాళ్ళల్లో ఒకావిడ,,వాళ్ల దృష్టి లో అర్ధ రూపాయి,రూపాయి  కు కూడా విలువ లేదు,,పావలా కి ఇప్పుడు విలువ లేనిది అర్ధరూపాయి కేమైంది.అర్ధరూపాయి చెల్లుబడి అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయా .,,చిల్లర అంటే అయిదు రూపాల బిళ్ల అనే కాలం వస్తుందేమో అని అనిపిస్తోంది,,,తొందరగా రూపాయి బిళ్ళలు కూడా ఖర్చు చేసుకుంటే మంచిదేమో,,