Jan 12, 2011

మార్పు

గత రెండు రోజుల నుండి నాలో నాకే తెలియని మార్పు కనిపించింది.దానికి కారణం మా టీవీ సరిగా రావటం లేదు..సో అస్సలు టీవీ చూడటం లేదు.దీనికి తోడు కంప్యూటర్ కూడా పాడయింది...నా బతుకు కుడితి లో పడ్డ ఎలుక ల ఉంటుందేమో ఏమి తోచక అని అనుకున్నాను నేను.కానీ చిత్రం గా చాలా ఆనందం గా గడిచింది..మా బాబు కు బడికి శెలవలు ఇచ్చారు..ప్రతిరోజూ అయితే అల్లరి చేస్తున్నాడు అని కోప్పడుతుండే దాన్ని...ఇప్పుడు టీవీ లేదు,కంప్యూటర్ లేదు కదా ఇంక నాకే ఏమి చేయాలో తోచక బాబు తో ఆడుకోవటం,abcd నేర్పటం,లెటర్స్ దిద్దించటం అలా ఏదో పని చేస్తూనే ఉన్నాను..పని లేకపోయినా కలిపించుకుని చేస్తున్నాను..ఇది వరకు అయితే టీవీ లో ఏదో సినిమా నో సీరియల్ నో చూస్తూ ఉండేదాన్ని...లేదా కంప్యూటర్ లో online ఉండే మా ఫ్రెండ్స్ తో చాట్ చేస్తూ ఉండేదాన్ని.కూర్చున్న చోట నుండి కదలాలి అంటే బద్ధకం వేసేది.గంటలు నిముషాల్లగా గడిచేవి.మా బాబు ఆడుకుందాం రా అని పిలిచినా టీవీ లో బొమ్మలు చూద్దాం అనో,,ఇంట్లోనే ఆడుదాం అనో ఏదో చెప్పి సర్దిపుచ్చేదాన్ని..రా రా ఆడుకుందాం అని పిలుస్తూ ఉంటే నస పెడుతున్నావ్  అని పాపం చికాకు పడేదాన్ని,ఏదో ఆ టైం కు కరెక్ట్ గా సీరియల్ లోనో సినిమా లోనో suspence సీన్ వస్తుండేది.ఏం చేస్తాం.మనసు లాగుతుంది టీవీ వైపు .మరి ఇంతా చూసాక ఆ ఒక్క సీన్ మిస్ అయితే ఎలాగు అనిపిస్తుంది.నాకు తగ్గట్టే జెమిని మూవీస్ వాడు gap లేకుండా సినిమాలు వేస్తాడు..ఒకటి అయ్యేలోపు ఇంకొకటి,దేనికదే చూద్దాం ఇప్పుడు అంత పనేముంది లే అని అనిపిస్తుంది.ఇంక సాయంత్రం మా వారు ఆఫీసు నుండి వచ్చి రాగానే laptop ముందు కూర్చుంటారు..ఇంక ఇంట్లో వాళ్లతో ఏమి కబుర్లు కమామీషు ఉండదు,అన్నం తినేటప్పుడు కూడా ఆ టీవీ చూస్తూ ముద్ద లోపలకు పోతుంటుంది.కానీ ఈ రెండు రోజులు భిన్నం గా ఆనందం గా గడిచాయి.ఇది వరకు ఆడవారు అంత నాజూకు గా పని అంతా ఎలా చేసుకునేవారా అనుకునేదాన్ని..ఏముంది ఏమి తోచక కూడా ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండి ఉంటారు కదా..ఇప్పటి వాళ్ల లాగా కంప్యూటర్ కు అతుక్కుని ఉండరు కదా గంటలు గంటలు కూర్చొని...టెక్నాలజీ వచ్చి  మంచి జరిగినా
గంటలు గంటలు ఇలాగా కంప్యూటర్ ల ముందు,టీవీ ల ముందు కూర్చుంటే చాలా నష్టపోతామేమో అని అనిపిస్తోంది..అతి సర్వత్ర వర్జయేత్

2 comments:

  1. Chala baga chepparu..:)
    Koncham font size penchandi.

    ReplyDelete
  2. మంజుల గారు మీ బ్లాగ్ అంత చూసాను...
    బ్లాగ్ చదువుతున్నట్టు కాక ఒక నేస్తం తొ మాట్లాదుతున్నట్టు అనిపించింధి.చాల బాగుందండి.చాల రోజుల తర్వాత ఒక స్నెహితున్ని కలిసినట్టుంది . చిట్టి మగదీరున్ని అడిగానని చెప్పండి.....

    ReplyDelete