Showing posts with label Jokes. Show all posts
Showing posts with label Jokes. Show all posts

Apr 16, 2011

నవ్వుకోండి సరదాగా

 నేను చదివిన వాటిలో నాకు నచ్చిన జోకులు,,మీరు సరదాగా చదివి కాసేపు ఆనందించండి..

డిశ్చార్జ్ అయి వెళ్లబోతున్న పేషెంట్ తో " ఇప్పుడు తేలిగ్గానే ఉంది కదూ!" అడిగాడు డాక్టర్. "కరక్టే..... డాక్టర్! ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది." అంటూ జవాబిచ్చాడు పేషెంట్ పర్సు తడుముకుంటూ
                                         


జడ్జి: "నువ్వెన్టయ్య మాటిమాటికి వాళ్ళింట్లోనే దొంగతనం చేస్తున్నావు?" దొంగ: " నేను వాళ్ల ఫ్యామిలీ దొంగని సార్."


రెండు  చీమలు  బాగా  తప్ప  తాగేసి  రోడ్  మీద  తిరుగుతున్నాయి ,ఇంతలో  అక్కడికి  ఒక  ఏనుగు  వస్తుంది  వాళ్ళకి  అడ్డంగా  ........
1st చీమ  అంటుంది  : ఇపుడు  రారా   చూసుకుందాం  అంటుంది  ఏనుగుని  .

2nd చీమ  అంటుంది  : వదిలేయ్    మామ  మనం  ఇద్దరం  వున్నాము  పాపం  వాడు  ఒక్కడే  ఇంకేమి  వస్తాడు  లే  అని  .

 
అడవి  లో  వొక  ఎలుక  పెళ్లీడు  కి  వచ్చింది . ఆ  ఎలుక  కి  పెళ్లి  సంబంధాలు  చూస్తున్నారు . వొక  రోజు  ఎలుక  ను  చూడటానికి  ఏనుగు  వచ్చింది . ఎలుక  కి  ఏనుగు  నచ్చలేదట  ! ఎందుకు ? అంటే  "అబ్బాయికి  పళ్ళు  బయటకి  కనిపిస్తున్నాయి " అని  చెప్పింది !!!!


 భర్త కోసం ఆఫీసుకు ఫోన్ చేసింది ధనలక్ష్మి. "కొంచెం మా ఆయన్ను పిలుస్తారా?" అడిగింది ఆపరేటర్ని.
"number please" అడిగింది ఆపరేటర్.
"నెంబరేమిటి నీ బొంద. నాకేమైనా పదిమంది మొగుళ్ళనుకున్నావా?" కయ్*మంది ధనలక్ష్మి. 


"నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు
"అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి.
"మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు
"మీ అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి.