Showing posts with label కధ. Show all posts
Showing posts with label కధ. Show all posts

Dec 11, 2011

మనసున్న మారాజు

సమయము సాయంత్రం అయిదు గంటలు.పార్కు లో అటు ఇటు అసహనం గా తిరుగుతూ ఉన్నాడు శ్రీను.ఇంత సేపా ఎప్పుడనగా వస్తానన్నావ్ అంటూ చిందులు తొక్కాడు అప్పుడే అక్కడకు వచ్చిన దీప్తి తో....దీప్తి,శ్రీను లకు ఒకరంటే ఒకరికి ప్రేమ..రెండు రోజుల క్రితమే పెళ్లి ప్రస్తావన తెచ్చాడు  శ్రీను..ఆలోచించుకుని అభిప్రాయము చెప్పమని సమయం కూడా ఇచ్చాడు దీప్తి కు ..
ఇంతకీ ఏమని నిర్ణయించుకున్నావ్..ఇంట్లో వాళ్ల అనుమతి తో చేసుకుందామని నా లేక ఎక్కడి కైనా వెళ్ళిపోయి చేసుకుందామా ,అని సూటి గా ప్రశ్నించాడు శ్రీను . ప్లీజ్
ఇంకా ఎవరినైనా పెళ్లి చేసుకొని హ్యాపీ గా ఉండు,,మనం మంచి స్నేహితులు గానే ఉందాం,,మన పెళ్లి మీ పెద్దలు,మా పెద్దలు ఇద్దరు ఒప్పుకోరు,,ఈ సమాజం కూడా ఒప్పుకోదు..నన్ను అందరూ చులకన గా చూస్తారు..అంటూ బాధ గా కంట తడి పెట్టింది దీప్తి..ఎవరో ఏదో అనుకుంటారు అని నా మనసు ని కష్ట పెట్టుకోమంటావా,,నేను మొదటి సారి నిన్ను చూసినప్పుడే నిన్ను ఇష్టపడ్డాను,,అప్పుడు నీకు పెళ్లి అయిందని నాకు తెలియదు,,,తర్వాత తెలిసింది స్నేహితుల ద్వారా నీకు పెళ్లి అయ్యి భర్త నాలుగు రోజుల లోనే రోడ్ ఆక్సిడెంట్ లో మరణించాడు అని...అది ఏదో విధివశాత్తు జరిగిన ఘటన...ఆ విషయం తెలిసినాక కూడా నా లో నీ పై ఉన్న  ప్రేమ ఏమి మారలేదు,,ఇంకా ఇష్టం పెరిగింది..నీ కాళ్ళ మీద నీవు నిలబడేందుకు ఆ ఘటన నుండి మనసు మళ్ళి ఇంచుకునేందుకు  నువ్వు చక్కగా ఉద్యోగం కూడా చేసుకుంటున్నావ్  ,,ఆ పాత  గాయం నే గుర్తు చేసుకుంటూ జీవితాన్ని ముగించేస్తావా ,,,ఇంటిలో  వాళ్ళను ఒప్పించు మనం ఇద్దరం పెళ్లి చేసుకుని హయిగా ఉందాం...అని ఒప్పించ చూసాడు దీప్తి ని...ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా ఈ ఊరిలో  వాళ్ళు నవ్వుతారు శ్రీను....ఏవో సినిమాల వరకే పరిమితం అలాంటి సామజిక వివాహాలు మన పల్లెటూరి లో అలాంటివి సాధ్యం కావు,,,అందరిని ఎదిరించి మనం మాత్రం ఎలా సుఖం గా ఉండగలం,,ఇలాగే ఉండాలి అని నా జీవితం రాసిపెట్టి ఉన్నట్టుంది ...నా వలన నువ్వు ఇబ్బందులు పడటం నాకు ఇష్టం లేదు,, పెద్దవాళ్ళను ఒప్పించగలిగితే  అప్పుడు చూద్దాం  అని చెప్పి అక్కడినుండి ఏడుస్తూ వెళ్ళిపోయింది దీప్తి..
తరువాత ఇరువురి ఇళ్ళల్లోను ఒప్పించటానికి చాలా ప్రయత్నాలే చేసాడు శ్రీను,,,మనసులో ఒప్పుకోవాలి అని ఉన్నా  బంధువులు,చుట్టూ పక్కల వాళ్ళు,సమాజం ఏమంటుందో అన్న భయం తో ఇరువురు తల్లిదండ్రులు ఈ పెళ్ళికి అంగీకరించలేదు...స్నేహితుల సహాయం తో దీప్తి ని ఒప్పించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు శ్రీను
 టీవీ వాళ్ళు,పేపర్ వాళ్లు..శ్రీను ఔదార్యాన్ని ఎంతో మెచ్చుకున్నారు,,,ఆ రోజూ అంతా టీవీ లలోను,ఊరి  లొనూ అందరూ శ్రీను ను పొగుడుతూ ఉంటే శ్రీను తల్లిదండ్రులు ఎంతో బాధ పడ్డారు...కన్న కొడుకు మనసుని అతని ఔన్నత్యాన్ని గ్రహించాలేకపోయమే..ఎవరో అనుకుంటారు అని ఇరువురి మనసులు నొప్పించామే,,అయినా వాడు చేసిన పని లో తప్పు ఏమి లేదే ఒక మనిషి కి జీవితాన్ని ఇచ్చాడు,,,వాడి  ప్రేమను గెలుచుకున్నాడు,,అనవసరం గా పంతానికి వెళ్ళాం  అని బాధపడి మనసార నూతన వధువరులను దీవించి తమ ఇంటికి స్వాగతించారు...మగవాళ్ళ లో మృగాళ్ళే కాదు..మనసున్న మగవాళ్ళు కూడా ఉన్నారు అని నిరూపించాడు శ్రీను...
------------------------------------------------------------------------------------------------------------------------
ఇది నా ఉహా కధా కానే కాదు,,,నిజం గా ఈ విధం గా పెళ్లి చేసుకున్న జంట ఉన్నారు  మా ఊరిలో ,,,పేరులు అవే పెట్టటం బాగుండదు అని పేర్లు మార్చాను,,,ఎప్పుడో ఆరునెలల క్రితం జరిగిన విషయం...రాద్దాం అనుకున్నా కాని ఇప్పటిదాకా కుదరనే లేదు,,,ఆడవాళ్ళ మీద ఆసిడ్ పోసే క్రూరులు ఉన్నారు,,,మంచి గా అర్ధం చేసుకుని జీవితాన్ని ఇచ్చే మగ వాళ్ళు ఉన్నారు,,,మన మీడియా కూడా మంచి చేసే వాళ్ళను ఏనాడు ప్రోత్సహించదు,,అలాంటి వాళ్ళను నలుగురిని చూపించి వాళ్ల గురించి చెప్పినా కొంత అన్నా మార్పు వస్తుంది సమాజం లో,,మన ఆలోచన ధోరణిలో.. 

Aug 28, 2010

ప్రాణం ఖరీదు

రాత్రి పదకొండు గంటలకు కాలింగ్  బెల్ మోతకు వెళ్లి తలుపు తీసింది రమణి.ఎదురుగ మత్తులో జోగి ,వంటి నిండా కట్ల తో ఉన్న కొడుకు నిఖిల్ ను చూసి నిశ్చేష్టురాలు అయింది రమణి."ఏమి లేదు ఆంటీ. ఇవ్వాళ birthday కదా అని రెండు పెగ్గులు ఎక్కువ వేసాడు,,ఫ్రెండ్స్ తో బెట్ కట్టి byke రేస్ లో participate చేసాడు,బాలన్సు తప్పి పడిపోయాడు,మరేమి పర్వాలేదు అన్నారు డాక్టర్స్ అని చెప్పి నిఖిల్ ను సోఫా లో కూర్చోపెట్టి వాళ్ల పని అయిపోయిన్దనిపించి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్.లేక లేక పుట్టిన ఒక్క కానోక్క కొడుకు ను ఈ స్తితి లో చూసి తల్లడిల్లిపోయింది రమణి."అర్ధరాత్రి పూట ఎందుకురా ఆ పందాలు అవి..ఎన్ని సార్లు చెప్పాలి పబ్బు లకు  క్లబ్బులకు వెళ్లొద్దు తాగి రావద్దు అని,,తొందరగా ఇంటికి వచ్చి హాయ్ గా మాతో ఉండక ఎందుకురా ఫ్రెండ్స్ అంటూ తిరుగుతావు,,ఏదో చిన్న దెబ్బలు కాబట్టి సరిపోయింది,నీకేమన్నా అయితే మేమేమయి పోవాలి రా" అంటూ ఏడుపు లంఘిన్చుకుంది తల్లి.అస్సలే మత్తులో తూగుతూ దెబ్బలతో కొంచెం చికాకు గా ఉన్న నిఖిల్ కు అమ్మ ఏడుపులు చికాకు ను రెట్టింపు చేసాయి,"ఛి ఛి అందుకే నేను ఇంటికి రాను ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. చిన్నప్పుడు చదువు చదువు అని.ఏదో ఆ ఇంజనీరింగ్ అయిన్దనిపించాక ఉద్యోగం ఉద్యోగం అని సతాయించారు..ఏదో నా అదృష్టం బాగుంది మంచి జాబు వచ్చింది.నా జీతం నాకు పాకెట్ మనీ కు సరిపోతుంది,,ఇప్పుడు కూడా నన్ను ప్రశాంతం గా నా పని నన్ను చేసుకోనీయరా,ఎంజాయ్ చేస్తే తప్పేంటి.ఏమంత కాని పని చేసానని" అని విసుకుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు నిఖిల్.
ఆ రాత్రంతా రమణి,గోపాల్ లకు కంటి మీద కునుకు పట్టలేదు..కొడుకు ఇలా చేయి దాటిపోతున్నాడు అని మనసులో బాధ పడసాగారు,ఒక్క కానోక్క కొడుకు అని చిన్నప్పటినుండి గారాబం గా పెంచారు.అడిగింది కాదనకుండా ఇచ్చారు.ఎంతో మంచి పోసిషన్ లో ఉండాలి తమ కొడుకు అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.స్వతహాగా తెలివిగల వాడే నిఖిల్.ఇంజనీరింగ్ వరకు బాగానే ఉన్నాడు.ఇంజనీరింగ్ అయిపొయింది వెంటనే మంచి కంపెనీ లో ఉద్యోగం వచ్చింది అప్పటినుండి ఫ్రెండ్ సర్కిల్ పెరిగింది,సొంత సంపాదన.పాతికవేల జీతం..ఒక్కసారి గా అలాంటి జీవితం,జీతం అందేటప్పటికి ఒక్కొక్క వ్యసనము అలవాటు అయింది.పబ్బులు క్లబ్బులు  వెళ్ళటం అలవాటు అయింది.లేట్ నైట్ పార్టీస్ మొదలు అయ్యాయి.దీనికి తోడు byke racelu అంటూ కొత్తగా మొదలు పెట్టాడు.వద్దని ఎన్ని సార్లు చెప్పినా అమ్మ నాన్న ల మాట చెవిన పడలేదు నిఖిల్ కు.చూద్దాం కాలమే సమాధానం చెబుతుంది అని సర్ది చెప్పుకున్నారు రమణి,గోపాల్ దంపతులు.
ఒక వారం గడిచింది.గాయం కాస్త పాత పడింది.మళ్లీ byke రేస్ అని పందెం మొదలుపెట్టాడు.ఎంతో ఫాస్ట్ గా దుసుకుపోతుండగా సడన్ గా ముందు ఉన్న కిరణ్  బండి స్కిడ్ అయ్యి పల్టీలు కొడుతూ వెల్లకిలా పడ్డాడు.బండి వచ్చి అమాంతం మీద ఒరిగిపోయింది.ఒక్కసారి గా అందరూ భయ పడ్డారు జరిగినదానిని చూసి,,వెంటనే హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకు వెళ్లి చికిత్స స్టార్ట్ చేయించారు.ఏదో ప్రాధమిక చికిత్స చేసి చిన్న చిన్న దెబ్బలకు కట్టు కట్టారు డాక్టర్స్.కానీ వెన్నుముక కు బలమయిన గాయం తగలటం వలన ఇంక పైకి లేవలేడని డాక్టర్స్ తేల్చి చెప్పేశారు.ఒక్కసారి గా ఫ్రెండ్స్ అందరూ ఉలిక్కి పడ్డారు.అప్పటి దాక తమతో ఉత్సాహం గా చిందులేసిన తమ స్నేహితుడు ఇంక అస్సలు లేచి నిలవలేడని విని తట్టుకోలేకపోయారు.ఇది అంతా నావలన నే  కదా. అనవసరం గా నేనే పోటిపడదాం అని వాడిని రెచ్చకోట్టానే అని గుండెలవిసేలా రోదించాడు నిఖిల్.ఇంతలో వార్త తెలిసి కిరణ్ వాళ్ల parents హాస్పిటల్ కు చేరుకొని మంచం లో ఉన్న తమ కొడుకును చూసి మూర్చపోయారు.తమకు ఎంతో చేదోడుగా ఉంటాడు అని ఎంతో కష్టపడి ఉన్నదానిలోనే దాచి చదివించి చేతి కి అందివచ్చే టైం కు తమ కొడుకు ఇలా మంచానికి అతుక్కుపోవటం చూసి తట్టుకోలేకపోయారు.
ఒక నెల తర్వాత తన జీతం తెసుకుని ఆఫీసు నుండి నేరుగా కిరణ్ వాళ్ల ఇంటికి వెళ్ళాడు నిఖిల్.మంచం లో ఉన్న తన ఫ్రెండ్ ను చూసి తట్టుకోలేకపోయాడు నిఖిల్.తన జీతం లో సగం మొత్తం ఒక పదిహేను వేలును కిరణ్ తండ్రి కి ఇచ్చాడు."సారీ అంకుల్.వీడిని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది.ఇదంతా నా వల్లనే జరిగింది అనిపిస్తోంది నాకు.నేను అనవసరం గా వీడిని పురికొల్పకపోతే వీడు byke రేస్ లో పాల్గొనేవాడే కాదు.మా అమ్మా  వాళ్ళు ఎంత చెప్పినా మొండిగా వినలేదు నేను.ఈ శిక్ష ఏదో నాకే వేసుంటే బాగుండేది ఆ దేవుడు.అన్యాయం గా నా ఫ్రెండ్ బలి అయిపోయాడు.నా మూలం గా వాడి ఉద్యోగం పోయింది.మీరు ఇబ్బందులలో ఉంటారు అని నా జీతం లో సగం వాడికి ఇద్దాం అనుకుంటున్నాను.ఇక నుండి మందు తాగను,బైకే రేస్ లు చేయను నా ఫ్రెండ్ సాక్షి గా" అని కుమిలి కుమిలి ఏడ్చాడు నిఖిల్.అప్పటినుండి మందు,byke racelu మానేసి నలుగురికి ఉపయోగ పడే పనులు చేయటం మొదలుపెట్టాడు నిఖిల్.తన ఫ్రెండ్ కు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నాడు.తమ కొడుకు లో వచ్చిన మార్పు ను చూసి ఎంతో సంతోషించారు నిఖిల్ తల్లిదండ్రులు.

Jul 22, 2010

మనోవేదన

"అమ్మా" అనే పిలుపు వినిపించేసరికి ఒక్కసారి ఉలిక్కి పడి చూసింది వందన.తన చుట్టూ ఎవ్వరు లేరు ఏదో ఆలాపన అని అనుకొని తన పని లో నిమగ్నం అయ్యింది.మళ్లీ అమ్మా అనే పిలుపు వినిపించి ఎవ్వరు అది అని పిలిచింది కంగారుగా,,నేనమ్మా నీ బొజ్జలో ఉన్న పాపాయినమ్మ అని ముద్దు ముద్దు మాటలతో పలికింది ఒక స్వరం.వందన అప్పటికే తొమ్మిదవ నెల గర్భవతి.డాక్టర్ వారం లో ఆపరేషన్ చేయటానికి డేట్ ఫిక్స్ చేసింది.
తన పాప తనతో మాట్లాడుతోంది అని ఒకింత సంబ్రమాశ్చర్యాలకు లోనయింది వందన.తను అప్పుడప్పుడు అలాగే తన పాప తో మాట్లాడుతూ ఉంటుంది.అలాంటిది పాప తనతో మాట్లాడేటప్పటికి ఆనందం పట్టలేకపోయింది.
"నా బంగారు తల్లి నా,ఏంటమ్మా  ఇంకా బజ్జోలేదా" అని అనునయం గా అడిగింది వందన."లేదమ్మా ఎందుకో భయం గా ఉంది,నిద్ర రావటం లేదు,బాధ గా ఉంది"అది ఆ పసి హృదయం."నీకు బాధలేంటి అమ్మా,హాయ్ గా నిద్ర పో"అని లాలించింది వందన."కాదమ్మా ఇంక నేను ఒక వారం లో వచ్చేస్తా కదా అందుకే దిగులు గా ఉంది"అన్నది పాప."బాధ ఎందుకమ్మా నేను ఉన్నాను కదా,నీకు ఏలోటూ రానివ్వను,అన్నీ కొనిపిస్తాను,నా కంటి రెప్ప లా చూసుకుంటాను" అని తన ప్రేమనంతా కూడకట్టుకుని  మాటల్లో చెప్పింది."అడిగినవన్నీ కొనిస్తావమ్మా నువ్వు నాకు తెలుసు కానీ నువ్వే ఉండవు కదా నాతొ ఆడుకోవటానికి,నీ వొళ్ళో కూర్చోపెట్టుకుని జోకొట్ట టానికి" అని బాధ గా అంది పాప,అదేంటమ్మ అలాంటావ్,నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అని ధైర్యం చెప్పింది వందన."నిన్ననే కదా అమ్మా నువ్వు అన్నావ్ ఇంక మూడు నెలలే ఉంది నా లీవ్. తర్వాత కేర్ సెంటర్ లో చేర్చుదాం అని,ఆ కేర్ సెంటర్ ఆంటీ ని కూడా కలిసావ్ కదా అమ్మా,ఎన్ని వేలయిన పర్వాలేదు మంచి దానిలో చేర్చుదాం అన్నావ్ కదమ్మా,అక్కడ ఉన్న  పిల్లలందరి లొనూ నవ్వే లేదు,అందరూ భయం భయం గా ఉన్నారు,అమ్మ కావాలి అని ఏడుస్తున్నారు.కొట్టి మరి తినిపిస్తోంది అమ్మా ఆయా అన్నం ఒక బాబు కు,చక్కగా అమ్మ చేతి గోరుముద్దలు తినాలి అని ఉంటుందమ్మ నాకు,నాకే కాదు నాలాంటి పిల్లలందరికీ ఉంటుంది. కాసేపన్నా అమ్మవొడిలో  కూర్చోవాలి అని,ఆ వెచ్చదనం ను ఆస్వాదించాలి అని అనిపిస్తున్దమ్మ నాకు.ఉదయం నుండి సాయంత్రం దాక జైల్లో ఉన్నట్లు ఉంటుంది.రాత్రి కి ఎప్పటికో వాస్తావ్ నాకేమో నిద్ర వచ్చేస్తుంది.నీతో ఆడెదెప్పుడు,నా చిలిపి చేష్టలను ,నా ప్రతికదలికను నువ్వు చూసి ఆనందించేదేప్పుడు ,నన్ను స్వేచ్చగా నీ కడుపు లో కూడా ఉండనియట్లేదు నువ్వు నేను ఎప్పుడు రావాలో కూడా నువ్వే మంచి రోజు నిర్నయించేసావు,,ఇదెక్కడి న్యాయం అమ్మా,ఇదివరకు బయటి ప్రపంచం చూడాలి అని ఉవ్విళ్ళూరే వాళ్ళు ట కడుపులో పాపాయిలు,కానీ ఇప్పుడు నాకు రావాలి అంటేనే భయం వేస్తోందమ్మ" అంటూ కళ్ళనీళ్ళు  పెట్టుకుని బోరున ఏడ్చింది చిట్టి తల్లి,,,

గబక్కున మెలకువ వచ్చింది వందన కు.చుట్టూ చుస్తే ఎవరు లేరు,వందన భర్త ఇంక నిద్రలోనే ఉన్నాడు,అయితే ఇప్పటి దాక తను పాప తో మాట్లాడిందంతా కలలో కాబోలు అని అనుకున్నది,,ఏంటి అంత కంగారు గా లేచావ్ అంటూ లేచాడు వందన భర్త,"ఏమి లేదండి,నేను ఒక ఏడాది అన్న నా లీవ్ ని extension చేస్తాను,ఈ జాబు కాకపోతే నాకు వేరే జాబు వస్తుంది, పాప కు నేను కాకబోతే ఎవరు చూస్తారు,నాకు ఆ creche నచ్చలేదు.పాపను స్వేచ్చగా,నా కళ్ళ ఎదురుగానే పెంచుకుంటాను,దాని ప్రతి అడుగు నేను ఎంజాయ్ చేయాలి,నా పాప ను నేనే కన్నుల్లో పెట్టుకుని చూసుకోవాలి"అని ఉద్వేగ భరితమయి కళ్ళ నీళ్ళతో భర్త ను అడిగింది వందన,"అలాగే అలాగే చేద్దాం లే దానికోసం ఎందుకు కంగారు పడుతున్నావ్,నీకు ఇష్టం అయినప్పుడే జాబు లో చేరుదువు గాని" అని భరోసా ఇచ్చాడు భర్త.ఇంక ఏ దిగులు లేదులే హాయ్ గా బజ్జో అని మనసులో అనుకుని పొట్ట మీద చేయి వేసుకుని నిశ్చింత గా నిద్రపోయింది వందన.



ఉద్యోగం చేసే ప్రతి మహిళ కు ఉండే బాధే ఇది,కానీ ఒక్క ఏడాది లీవ్ తీసుకున్నంత మాత్రానా మనం ఏమి కెరీర్ లో నష్ట పోము కదా,పిల్లలా మానసిక ఎదుగుదల చక్కగా ఉంటుంది తల్లి దగ్గర పెరిగితే,,నేను కూడా ముందు ఎక్కడో ఒక చోట పెడదాం లే బాబు ను అనుకున్నాను,కుదరక నేనే జాబు మానేసాను,,మళ్లీ ట్రై చేయొచ్చు,కానీ ఈ మధ్యనే తెలుస్తోంది అమ్మ ఎంత important నో  first one year  చైల్డ్ growth కు.

Jul 12, 2010

అనుబంధాలు

"ఛీ  ఛీ..వెధవ ప్రయాణం..అమెరికా నుండి ఇండియా కు ఏమీ  శ్రమ లేకుండానే వచ్చాం కానీ ఇక్కడనుండి పక్కన ఉన్న విజయవాడ కు వెళ్ళినందుకు ఒళ్ళు హూనం అయిపొయింది," అని ఇంటి లోపలకు వస్తూనే ప్రకాశం చిందులు తొక్కాడు,,ఏమైంది రా అంత విసుగ్గా ఉన్నావ్,,దర్సనం బాగా జరగలేదా అని తండ్రి అడిగాడు,,"ఒకటనేమిటి లే అన్నీ అన్ని గా నే ఉన్నాయి.ఈ రోడ్లు ఎంత గుంటలు పడిపోయి ఉన్నాయి,,మన గవర్నమెంట్ వాళ్ళకు ఏమి కనపడవా?"  అని.కాస్త మెయిన్ రోడ్ వరకు కొంచెం ఇబ్బంది తర్వాత హై వే వేసారు కదరా రూట్  బానే ఉంటుందే..అని సర్ది చెప్పపోయాడు తండ్రి పరంధామయ్య.,"ఆ కొంచెం లో కొంచెం నయం లే,,అయినా ఒక్కళ్ళు కూడా ట్రాఫ్ఫిక్ సెన్స్ పాటించరు,,ఆ సిగ్నళ్ళు కూడా పని  చేయవు,అందుకే ఆన్ని ప్రమాదాలు మన దేశం లో,ఈ కాస్త ప్రయానానికే పిల్లలు ఎలా హైరానా పడ్డారో  చూడండీ " అని చిర్రు బుర్రు లాడాడు ప్రకాశం తన పదిహేనేళ్ళ పిల్లలను చూపించి.."ఇంత చిన్న దానికే అలా హైరానా పడితే ఎలారా,,అయినా మీరు వెళ్ళింది కారు లోనే కదా.బస్స్ లో ఏమి కాదు కదా??" అని చిరుకోపం గా అన్నాడు పరంధామయ్య.
(ప్రకాశం గత పదేళ్లుగా అమెరికా లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు,,పిల్లలు అక్కడే చదువుకుంటున్నారు,,తల్లిదండ్రులు ను చూద్దాం అని ఒక నెల సెలవు పెట్టి సొంత ఊరు  కు వచ్చాడు,,వాళ్ళది విజయవాడ కు దగ్గర లోని పల్లెటూరు..)
తండ్రీ  కొడుకులు కలిసి దేశాన్నేమీ ఉద్దరించక్కర్లేదు కానీ, అన్నం వడ్డించాను రండి అని లోపల నుండి పిలిచింది ప్రకాశం తల్లి పార్వతమ్మ.
గ్లాస్సు లో ఉన్న మంచినీళ్ళను చూసి "ఛి dirty water ,,i dont want this " అని అన్నది ప్రకాశం చిన్న కూతురు..అమ్మా రేపటినుండి మినెరల్ వాటర్ తెప్పించండి...మీరు కూడా ఇలాంటి నీళ్ళే తాగుతున్నారా? ఆరోగ్యం పాడవుతుంది,,చూడండీ ఎలా ఉన్నాయో" అని అసహ్యం గా మొహం పెట్టి అన్నాడు ప్రకాశం..పార్వతమ్మ మొహం చిన్నబుచ్చుకుంది..వెంటనే పరంధామయ్య అందుకుని"నువ్వు చిన్నప్పుడంతా తాగింది ఈ నీళ్ళే కదరా,,ఇప్పుడు ఉళ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇవే గా తాగేది,కొత్తగా చెప్తున్నావ్" అని మందలించారు.ఇంక మరుసటి నుండి కొడుకు బాధ భరించ లేక mineral water తెప్పించ సాగాడు పరంధామయ్య.
ఇలాగె ఇబ్బందులతో కొన్ని రోజులు గడిచినాయి.
సుమ్మెర్ కావున ఎండలు బాగా ఉన్నాయి..లోపల పడుకోలేక ఒక రోజు ఆరుబయట మంచాలు వేసుకొని పడుకున్నారు ప్రకాశం ఫ్యామిలీ.పరంధామయ్య గారు,పార్వతమ్మ ఎప్పుడూ చెట్ల కిందే ఆరుబయట వసారా లో పడుకుంటారు చల్లని గాలి కోసం,వాళ్ళు ఈ ఫ్యాన్ గాలిలో ఇమడలేక..తెల్లారి లేచేసరికి ప్రకాశం కూతురి వొంటి నిండా దద్దుర్లు వచ్చేసాయి,రాత్రి బయట పడుకున్నందుకు దోమలు బాగా కుట్టేసాయి,"అందుకే మేము రాము మీరు ఒక్కరే వెళ్లి రమ్మంటే నా మాట విన్నారు కాదు చూడండీ ఏమయిందో అని" ఇంగ్లీష్ లో ప్రకాశం మీద మండిపడుతోంది ప్రకాశం భార్య..ప్రకాశం ఏమి చేయాలో తెలియక తండ్రి మీద ఎగిరాడు" చూడండీ ఏమయిందో,,అప్పుడప్పుడు ఎంతో కొంత డబ్బు పంపిస్తూనే ఉన్నాగా ఒక AC అన్నా కొనలేకపోయారా??ఈ దోమలు,ఈగలు ఏంటి మనతో పాటే మనుషులు లాగా తిరుగుతున్నాయి పగలు రాత్రి,,అస్సలు శుభ్రం ఉండదు,,అందుకే నాకు ఇండియా రావాలి అంటే ఇష్టం ఉండదు,,ఏమీ సౌకర్యాలు ఉండవు,,మీరేమో ఊరికే రండి రండి అంటారు,,ఇంక మళ్లీ ఒక పదేళ్ళ వరకు రమ్మనకండి.."అని విరుచుకుపడ్డాడు,,
పాపం పరంధామయ్య,పార్వతమ్మ లు బాగా బాధపడ్డారు,అయ్యో మనమేకదా వాళ్ళని రమ్మన్నది అని.
భారం గా రోజులు గడిచాయి ప్రకాశం కు..
వెళ్ళాల్సిన రోజు రానే వచ్చింది..
"నాన్న మీరు మమ్మల్ని రమ్మని ఫోన్ చేసిన ప్రతిసారి రమ్మని చెప్పేవారు.నాకు కూడా మిమ్మల్ని చూడాలనే ఉంటుంది..కానీ దగ్గర ఊళ్లు కాదు కదా ఊరికే వచ్చిపోవటానికి,,,అయినా వచ్చాక ఇన్ని ఇబ్బందుల తో మేము ఇక్కడ ఇమడలేము,,మేము వచ్చి ఇబ్బంది పడి దాన్ని చూసి మీరు బాధ పడి,ఎందుకు నాన్నా  ఇవన్నీ,,హాయ్ గా ఫోన్ లోనే మాట్లాడుకుందాము,మీరే రావటానికి ఏర్పాట్లు చేస్తాను ఈ సారి,అప్పుడు ఎవ్వరికి ఇబ్బంది ఉండదు,అక్కడ జీవితానికి అలవాటు పడిపోయాము మేము ఇక్కడ ఉండాలి అంటే కొంచెం ఇబ్బందే అవుతుంది,సారీ నాన్నా " అని తను చెప్పదలుచుక్కన్న నాలుగు ముక్కలు చెప్పేసాడు ప్రకాశం.
ఈ మాటలకు బాధపడి పరంధామయ్య "నిజమే రా,,మేము నీ చిన్నప్పుడు ఎన్నో కష్టాలు,చిన్న చిన్న కోరికలు కూడా కాదనుకుని నీకు అడిగినవి అన్నీ కొనిచ్చాము,ఆ బాధలు కూడా ఎంతో ఆనందిచాము,ఎందుకంటే నా కొడుకు కోసం అని అనిపించేది,,ఇప్పుడు ముసలివారము అయిపోయిన మాకోసం ఒక్క నెల కష్టాని ఒర్చుకోలేకపోతున్నవా?? చిన్నప్పటినుండి పిల్లలకు తాతయ్య,నానమ్మ అని అప్పుడప్పుడు అన్నా  మా గురించి బాగా చెప్తేనే వాళ్ళకు మా మీద అభిమానం,ప్రేమ కలుగుతాయి,ఇక్కడ ఉన్న నెల రోజులలో ఏ నాడు వాళ్ళు తాతా ఆని ఆప్యాం గా మా దగ్గరికి వచ్చింది లేదు,మనం చెప్పే దాన్ని బట్టే మన పిల్లల నడవడిక ఉంటుంది,మన వాళ్ల కోసం అంటే కొంచెం కష్టాన్నైనా ఇష్టం గా భావిస్తాము,పోనిలే బాబు మీరు రావద్దులే ఇక్కడకు,వచ్చి ఇబ్బంది పడటం ఎందుకులే,ఈ శేషజీవితం ఇక్కడే ఇలాగే గడిపేస్తాం,ఇక్కడ అంతా మాకు అలవాటు అయినదే కదా,మాకు ఇంతే ప్రాప్తం అనుకుంటాం,,"అని బాధాతప్త హృదయాలతో వీడ్కోలు పలికారు,.
-----------------------------------------------------------------------------------------------------------------------------
మన నిజ జీవితం లో ఇలాగా చాలా మందినే చూస్తూ ఉంటాము,అక్కడ అలవాట్లకు అలవాటు పడి ఇక్కడ adjust కాలేక నిజం గానే చాలా బాధ పడుతుంటారు,అంత దాక ఎందుకు మనమే ఈ నగర జీవితానికి అలవాటు పడి ఒక్క నాలుగు రోజులు పల్లెల్లో అది కూడా మనం పుట్టి పెరిగిన మన పల్లెటూరు లో ఉండాలి అంటేనే adjust కాలేకపోతున్నాము,మన వాళ్ళే వాళ్ళు అని అనుబంధం పెంచుకుంటే ఎంతటి కష్టాన్నైనా ఇష్టం గా భావించవచ్చు,,పెద్దవాళ్ళు కొంచెం అర్ధం చేసుకోవాలి,చిన్న వాళ్ళు కూడా కొంచెం adjust అవ్వాలి పరిస్థితులకు అపుడే బంధాలు అనుబంధాలు కలకాలం నిలుస్తాయి.

Jul 2, 2010

అడ్డుగోడలు

"అమ్మా,, అమ్మా " అని అరుచుకుంటూ ఇంటి లోపలి వచ్చాడు పదిహేనేళ్ళ  సంపత్.
"ఏంటి రా  ఏమయింది,ఏంటి హడావుడి గ వచ్చావ్ " అని ఆదుర్దాగా వంట ఇంటి లోనుండి వచ్చింది సంయుక్త ,సంపత్ వాళ్ళ అమ్మ..
"అమ్మా ఇవ్వాళ ప్రొగ్రెస్స్ reports ఇచ్చారు,నేను prefinal లో క్లాసు సెకండ్ వచ్చానమ్మ,," అని ఎంతో సంతోషం గ వాళ్ల అమ్మ కు చెప్పాడు,,
"కంగ్రాట్స్ కన్నా,,ఇంక బాగా చదివి ఈ సారి ఫైనల్స్ లో క్లాసు ఫస్ట్ రావాలి,,నువ్వు బాగా చదువుతావు నాకు ఆ నమ్మకముంది నీ పైన " అని  ఆప్యాయం గా కొడుకు తల నిమిరింది.
క్లాసు లో ఫస్ట్ ఎందుకు రాలేదు,ఎప్పుడూ సెకండ్ రాంక్ ఏనా, ఇన్ని మర్కులేనా, అని ఎప్పుడూ నిరాసపరచకుండా మంచి మాటలతో encourage చేసే వాళ్ల అమ్మ అంటే సంపత్ కు ఎంతో ఇష్టం...క్లాస్స్ లో ఫస్ట్ ఎవరికి  వచ్చింది రా ఈ సారి అని అనునయం గా అడిగింది సంయుక్త
"నా ఫ్రెండ్ నే అమ్మ  రాజు, ఎప్పుడూ వాడికే వస్తుంది ఫస్ట్ రాంక్,,బాగా చదువుతాడు,,క్లాసు లో నాకు doubts ఉంటే ఎప్పుడూ వాడే చెప్తాడు"
"అమ్మ, అమ్మా ,రేపటి నుండి preparation holidays నే కదా వాడిని మన ఇంటి కి రమ్మని చెప్తానమ్మా, ఇద్దరం కలిసి చదివుకుంటాం అని" బ్రతిమిలాడుతూ  అమ్మ ను అడిగాడు సంపత్.
సర్లే అలాగేలే  అని ముక్తసరిగా సమాధానం ఇచ్చింది సంయుక్త..
                                                              ########################################
"ఏంటే ఈ మధ్య బాగా నాగాలు పెడుతున్నావు,,,ఈ నెల లో ఇది నాలుగవది,,,ఇట్లాగయితే పని మనేసేయ్యి,,,వేరే వాళ్ళు నాకు కుదరకపోరు,,,రాను రాను మరీ నెత్తికెక్కి కూర్చుంటోంది" అని వాళ్ల పనిఅమ్మాయి లక్ష్మి మీద రుస రుస లాడుతోంది సంయుక్త.
"వానలు పడుతున్నాయి కదమ్మా,,బాగా పడిసెం పట్టి వంట్లో నలత గ ఉన్నాదని  రాలేకపోయానమ్మ,," అని దీనం గా సమాధానం ఇచ్చింది పనిఅమ్మాయి.
"ఏదో ఒకటి వంక చెప్తుంది పని ఎగ్గొట్టటానికి,,బానే ఉన్నావు గా " అని దీర్ఘాలు తీసింది సంయుక్త
"పోనిలేవే పాపం, బాలేదు అంటోంది గా ఒక్క రోజే గా అని సమర్ధించ పోయాడు" సంయుక్త భర్త సందీప్
"మీరు ఊరుకోండి,,ఒక్క రోజు రాకపోయేసరికి ఇంటెడు చాకిరీ చేయలేక చస్తున్నాను...మీకే చెప్తారు బాగానే,,,అయినా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి...పని వాళ్ళను పని వాళ్ల లాగానే చూడాలి" అని భర్త  మీద గయ్య్ మంది..
సంయుక్త వాళ్ళు కాస్తో కూస్తో డబ్బు ఉన్నవాళ్ళే,,భర్త software engineer గ జాబు చేస్తున్నాడు,,మంచి శాలరీ,,ఒక్క గానొక్క కొడుకు సంపత్..డబ్బుతో కూడిన అహంకారం కొంచెం ఎక్కువనే చెప్పుకోవచ్చు.పనివాళ్ళు అంటే కొంత చులకన భావం కూడా ఉంది,,పనివాళ్ళ కు గతి లేక వీళ్ళ దగ్గర పని చేస్తున్నారు అని భావిస్తుంది.అందుకే వాళ్ల మీద ఏదో ఒకటి అరుస్తూ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ ఉంటుంది..
                                                                 ###############################################
"అమ్మా అమ్మా నేను చెప్పానే రాజు వీడేనమ్మా "అని తల్లి కు పరిచయం చేసాడు సంపత్
"నమస్తే ఆంటీ" అని రాజు వినయం గ అన్నాడు.
కాసేపు  కబుర్లు  ఆడినతర్వత  "ఎక్కడుంటారు మీరు..ఏమీ చేస్తుంటారు మీ నాన్నగారు" అని అడిగింది  సంయుక్త
"మా నాన్నగారు నా చిన్నప్పుడే పోయారండి...మా అమ్మే కష్టపడి నన్ను చదివిస్తోంది..టాలెంట్ టెస్ట్ లో ఫస్ట్ వచ్చానని నాకు Fee concession కూడా ఇచ్చారండి స్కూల్ వాళ్ళు  " అని బాధ గ తన దయనీయమయిన  పరిస్థితిని వివరించాడు రాజు.
"అయ్యో అలాగా ,,పోనిలే బాబు నువ్వేమి బాధపడకు,,,రోజు వచ్చి మా వాడితో కలిసి చదువుకో...ఇద్దరు మంచి మార్కులతో పాస్ అవ్వాలి " అని జాలి గుండెతో అన్నది."అరె చెప్పాను కదరా మా అమ్మా అందరిలా కాదు...అందరిని మంచి గా Encourage చేస్తుంది...మా మంచి అమ్మ " అని తల్లి ని ఆప్యాయం గ చుట్టేసాడు సంపత్.మీ అమ్మ ఏమి చేస్తుంది అని అడగాలి అని సంయుక్త అనుకుంది కాని  ఇంక అడగలేకపోయింది..అయినా ఏదో చిన్న జాబు చేస్తూ ఉండి ఉంటుంది లేకపోతె ఇలాగ priavte schools లో చదువు చెప్పించలేరు కదా అని తనలో తానే అనుకుంది..
     ఆ రోజు స్కూల్ Annual డే.,ఆ రోజు స్కూల్ ఫస్ట్,సెకండ్ వచ్చినవాళ్ళకు prizes  ఇస్తారు ఆ స్కూల్ యాజమాన్యం.సంపత్ కు సెకండ్ రాంక్ వచ్చింది అందుకని వాళ్ల తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహం గ స్కూల్ కు విచ్చేశారు..ప్రైజ్ Distrubution  స్టార్ట్ చేసారు. "ఫస్ట్ ప్రైజ్ goes to రాజు అని announce చేసారు". రాజు కు ప్రైజ్ ఇస్తూ ప్రిన్సిపాల్ అభినందించారు."రాజు మన స్కూల్ లో చదవటం ఎంతో గర్వకారణం గా ఉంది నాకు.రాజు వాళ్ల నాన్నగారు చిన్నప్పుడే చనిపోతే వాళ్ల అమ్మ గారే  నాలుగు ఇళ్ళల్లో పనిచేసుకుంటూ  రాజు ను చదివిస్తున్నారు.ఆమె లాగా  తన పిల్లాడు  చదువు లేని వాడు కాకూడదు అని వాళ్ల అమ్మ రేయింబవళ్ళు కష్టపడింది...దానికి తగ్గట్టుగానే చిన్న వాడయినా రాజు అమ్మ కష్టాన్ని అర్ధం చేసుకుని చక్కగా చదివి ఫస్ట్ రాంక్ తెచ్చుకున్నాడు..మీరు కూడా బాగా చదివి మంచి రాంకులు తెచ్చుకోవాలి "అని రాజు గురించి మూడు ముక్కలు చెప్పారు..
రాజు ను మాట్లాడాల్సింది గా అందరు కోరగా రాజు "మా అమ్మ కష్టం చూసి నాకు బాధవేసేది,,అందుకనే పట్టుదలగా చదివేవాడిని...అమ్మ తో పాటు గా ఇంకొక అమ్మ కృషి కూడా ఉంది నా విజయం వెనుక. అది ఎవరో కాదు సంపత్ వాళ్ల అమ్మగారు అని చెప్పి ఆంటీ మీరు కూడా వేదిక పైకి రావాలి అంటీ  అని" గద్గద స్వరం తో పిలిచాడు,అందరూ కరతాళ ధ్వనులు చేస్తుండగా సంయుక్త వేదిక పైన కు వచ్చింది,"ఆంటీ మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే నేను ఇంతవాడిని అయ్యాను ఆంటీ,మేము పేదవారము అని తెలిసి కూడా ఆంటీ ఎంతో మంచి మనసు తో నన్ను ఆదరించింది,సంపత్ ను ప్రోత్సహించినట్టే నన్ను ప్రోత్సహించింది,నిజం గ చాలా చాలా thanx ఆంటీ అని కాళ్ళ మీద పడ్డాడు",సంయుక్త ఏమీ జరుగుతోందో అర్ధం కాని అయోమయం లో ఉంది,ఇంట్లో ఉన్న పని అమ్మాయి మీదేమో తను ఎప్పుడూ కసురుతూ ఉండేది,పని వాళ్ళను తన బానిసలూ గ భావించేది,అలాంటిది ఒక పని అమ్మాయి కొడుకు ఇంత బాగా చదివి ర్యాంకు తెచ్చుకోవడం,అది తన దగ్గరే ఉండి చదువుకోవడం,ఆ అబ్బాయి తనను ఎంతో ఉన్నతమైన వ్యక్తి అని పొగడటం,ఇది అంతా ఏదో గందరగోళం లాగా అనిపించింది ఒక్క క్షణం..
పనివాళ్ళయినా ఏదో వాళ్ల పరిస్థితి బాగోలేక మన దగ్గర చేరారు తప్ప వాళ్ళేదో తక్కువ జాతివాల్లని,అంటరాని వాళ్ళని అలా మనం తక్కువ చేసి చూడడం తప్పు.వాళ్ళు మనలాంటి మనుషులే  అని అర్ధం చేసుకుని  మనసులోనే తన తప్పుకు పశ్చాత్తాప్పడింది.తెలియకుండానే తన కంటి లోనుండి నీరు జల జలా రాలాయి ,కాస్త తెప్పరిల్లి రాజు ను పైకి లేపి హృదయపూర్వకం గా దగ్గరకు తీసుకుంది.తన మనసులోని అడ్డుగోడను కూల్చేసి మనస్పూర్తి గా రాజూను అభినందించింది,,,
                                     .........................................................
ఏదో నాకు నచ్చినది,తోచినది ఎప్పటినుండో రాద్దాం అని అనుకున్నాను ఒక కధలాగా,లేదా కధానిక లాగా,ఇదిగో ఇప్పటికి కుదిరింది,ఎలా ఉందొ నా కొత్త ప్రయోగం కాస్త చెప్పండి,బాగుంటే,నచ్చితే భేష్ అనండి,లేదనుకోండి ఇంకా ఎలా ఉండాలో ఎలా రాస్తే బాగుండేదో నాలుగు అక్షింతలు వెయ్యండి,రెండో సారి రాసేటప్పుడు ఆ లోపాలు సరిదిద్దుకుంటా..