Showing posts with label కవిత్వం. Show all posts
Showing posts with label కవిత్వం. Show all posts
Mar 25, 2011
Jun 28, 2010
మనోభావాలు
కలల ఊహల పల్లకీ లో ఊరేగుతూ
క్షణక్షణం నీ తలపులలో బ్రతుకుతూ
నా వాలుకన్నులనే నీ కోటగా మలచి
నా ప్రేమతో నిన్నా కోటలో బంధించి
నా కంటే సాటి ఇంకెవరూ లేరని భావించే
నీ కంటే నాకింక ఎవరు సాటి..
ప్రేమ,ఆప్యాయతలు అన్న పదాలకు
అర్ధం తెలియని పిచ్చిదానను నేను,,
వాటి ఉనికిని అనుక్షణం వెదుకుచూ,
ఆ బంధాలలోని మాధుర్యాన్ని గ్రోలాలని
నిలువెల్లా తపించే వేర్రిదానను నేను,,
అలాంటి నాకు
ఆ ప్రేమను,ఆప్యాయతను నిండు మనసుతో
నువ్వు అందిస్తుంటే,,
నీ ప్రేమను ఎలా కాదనగలను....
పొగడకుండా ఎలా ఉండగలను......
Jun 8, 2010
అక్షరాల బహుమతి
అయ్యో రామా
ఆంధ్రలేఖ వారినుండి రాంక్ వచ్చినా
ఇంతవరకు ఒక్క గిఫ్ట్ కూడా రాలేదు సుమండీ
ఈసారి అయినా వస్తుందేమో అని ఆకాశం లోకి చూస్తుంటే
ఉన్నట్టుండి మా కాలింగ్ బెల్ మోగింది
ఉపిరి ఆగిపోయినంత పని అయింది కోరిఅర్ అబ్బాయి చేతిలోని పెద్ద గిఫ్ట్ చూసి
ఎవరిదో అడ్రస్ తెలియక మా బెల్ కొట్టాడు ట
ఏమని చెప్పమంటారు నా పాట్లు
ఐన అదృష్టం కుడా ఉండాలి కదా
ఒక్కసారి అయినా నా బ్లాగును గొప్పగా పత్రికల్లో చూసుకోవాలి అనుకున్న
ఓహో అనక్కర్లేదు కానీ
ఔను పాపం అని నా బాధ గమనించి
అందరిని నా నుంచి రక్షించ డానికైనా నా ఏదో ఒక కానుక పంపిస్తే చాలు
అః ఇక మీ జోలికి రానే రాను....ఒట్టు...
May 19, 2010
లైలా తుఫాను
ఓ లైలా ఓహో లైలా
ఇంక ఆపవేలా?
మాపై నీకు ఇంత కోపమేలా?
ఇకనైనా విడిచి వెల్లవేలా?
అందరిని భయపెట్టేలా
ఏమి నీ లీలా
ఇంక చాలు నీ వరదల గలగలా
ఇంకనైన వెళ్ళిపో అలా అలా........
May 8, 2010
అమ్మ ప్రేమ
అత్యున్నత గిరి శిఖరం ఆమె సహనం ,,,
అతిలోతైన సముద్రం ఆమె మనసు,,,
అవ్యక్తమైన ప్రేమ ఆమె గుండె లోతుల్లో
అందరికి సరిసమానం గ లభించే ఏకైక ఆస్తి అమ్మ ప్రేమ,,,
అందుకే అమ్మ ఎవరికైనా అమ్మే!!!!!!!!!!
శరీరమంతా మనసులోకి ఇంకిపోతుంది,,,
మనస్సు దుఃఖ సముద్రం అవుతుంది,,,,
ఇది నేను మాతృదినోత్సవం సందర్భం గా ఏదో నాకు తోచిన భావాలు రాసాను,,,,మనం ఏదో పెద్ద పెద్ద బహుమతులు,ఏవేవో చేయనక్కర్లేదు... ఆమె మనసు కష్టపెట్టకుండా ఉంటే చాలు...మన వలన ఆమె కంటి నుండి నీరు రాకుండా ఉండేట్టు మనం చూసుకుంటే చాలు,,,
మాతామహులకు నా మాత్రుదినోత్సవ శుభాకాంక్షలు
Apr 17, 2010
నా కపిత్వం
ఏమి ఉబుసుపోక ఇవ్వాళ నేను నా కాలేజీ టైం నాటి డైరీ ఊరికే తిరగేసాను,, అందులో అప్పట్లో నేను చదివిన కవితలకు కొద్దిగా నా కపిత్వం జోడించి అంటే కొన్ని లైన్స్ మార్చి,కొన్ని లైన్స్ తీసేసి remix చేసి మళ్ళి రాసేదాన్ని,,,అదేనండి కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అంటారే ఆ విధం గ కవిత్వం ను కాస్త కపిత్వం చేశా చుడండి మీరూ కూడా..
ఒకరికొకరం ఎవరో కుడా తెలియని స్థితి నుంచి
ఒకరికోసం ఒకరం అన్న పరిస్థితి కి తెచ్చే
అద్భుతమైన బంధం...స్నేహం
కళ్యానిరాగం అంత మధురమైనది
రక్తసంబందానికి మించిన ఆత్మసంబంధం ...
.................మన ఈ స్నేహం...
ప్రేమ గుడ్డిది అనుకుంటున్నారా ...కాదు
ప్రేమకు చూపు ఉంటుంది,
అ చూపే నాకు నిన్ను చూపింది
నా హృదయాన్ని నీ వైపు నడిపింది
నిన్ను నన్ను దగ్గర చేసింది
నా "మనసంతా నువ్వే" అనేలా చేసి
"నువ్వు లేక నేను లేను" అయ్యేటట్లు చేసి
తనను తానూ నిరూపించుకుంది...
నిన్నే నిత్యం తలుస్తూ
నన్నే నిలువునా మరుస్తూ
నా ఆణువణువూ లో నిండిన నీ తలపులను చూసి
నాలో నేనే మురుస్తూ
నీకై నిలువెల్లా తపిస్తూ
నీలో విలీనమయ్యే రోజు కోసం వేచి చూస్తూ,,,
నిన్ను నా ప్రాణం కంటే మిన్న గా ప్రేమించే నీ......
నీ రాక కోసం
వేచి చూస్తున్న నయనానికి ఎలా చెప్పాను... నిద్రపోమని
నీ పిలుపు కోసం
పలవరిస్తున్న హృదయానికి ఎలా చెప్పాను... మానుకోమని
ఎలా చెప్పినా,ఎంత చెప్పినా,,,
నా మాట వినదే....
తన మారం ఆపదే.....
గుండెలో ఆశను తెలుపలేదు నా మౌనం
చూపులోని ఆశను చదవలేదు నీ స్నేహం
తలపులలో నీవు కొలువున్నా
కలుసుకోలేను ఎదురున్నా...
తెలిసి ఈ తప్పులు చేస్తున్నా,,
అడగవే ఒక్కసారి అయినా నేస్తమా
నీ పరిచయం కలకరిగించేటి కన్నీటి వానేనా????????
Apr 5, 2010
కవిత
నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని
మారదు లోకం మారదు కాలం
గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి
గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి
యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్ఠం
క్రిష్ణ గీత ఆర్పిందా నిత్య కురుక్షేత్రం
పాత రాతి గుహలు పాల రాతి గౄహాలయినా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా
వేట అదే వేటు అదే నాటి కధే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ
దీన్ని రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ట..చాలా బాగా రాసారు అనిపించింది..ప్రస్తుత భాగ్యనగర పరిస్థితే గుర్తుకువచ్చింది ఈ కవిత చదువుతున్నంత సేపు,,
మారరు ఈ జనం,మారదు ఈ రాజకీయం...
Mar 2, 2010
ఆణిముత్యాలు -2
బిడ్డ పుడితే అంత బరువు డబ్బు
చిన్నప్పుడు రోగం వస్తే నాన్నారు
"ఆ మెడకు" తయాట్టు కట్టారు,,,
స్కూల్ లో రాంక్ వస్తే మాష్టారు
"ఆ మెడకు" గోల్డ్ మెడల్ వేసారు.,,
కావలసిన కట్నం ఇచ్చాక మొగుడు
"ఆ మెడకు" తాళి కట్టాడు,,
ఇంతమందికి నచ్చిన "ఆ మెడకే"
అత్తగారు ఉరేసింది,,,,,,,
మానభంగానికి శిక్ష
పడుకున్న మా పాప చేతి లో
వాడి చిన్నతనం లో
మా ఆవిడ పురిటి నొప్పులు చూసాక
నా దేహానికి చొక్కాలు
హుండీలో వేస్తానని
తిరుపతి వెంకన్నకు మొక్కుకున్నాడు.
ఆడపిల్ల పుట్టింది.
ఆనందం లో మొక్కు మరిచాడు
అమ్మాయి పెళ్లికు
వడ్డీతో సహా శ్రీనివాస రావు పేరుతొ
అల్లుడి రూపం లో పట్టుకెళ్ళాడు...
చిన్నప్పుడు రోగం వస్తే నాన్నారు
"ఆ మెడకు" తయాట్టు కట్టారు,,,
స్కూల్ లో రాంక్ వస్తే మాష్టారు
"ఆ మెడకు" గోల్డ్ మెడల్ వేసారు.,,
కావలసిన కట్నం ఇచ్చాక మొగుడు
"ఆ మెడకు" తాళి కట్టాడు,,
ఇంతమందికి నచ్చిన "ఆ మెడకే"
అత్తగారు ఉరేసింది,,,,,,,
మానభంగానికి శిక్ష
......ఏడేళ్ళు అట
నిజమే
న్యాయశాస్త్రాన్ని రాసింది
........మగాడే గా
పడుకున్న మా పాప చేతి లో
కుక్క బొమ్మ ఉన్నది,,
ఆ బొమ్మ కల్లెప్పుడూ
నాకేసి ప్రశ్న వేస్తుంటాయి,,
తనలా నేనెందుకు
దగ్గర కాలేక పోతున్నాను అని,,,
వాడి చిన్నతనం లో
"ఊరికే" ఆడుతుంటే
తండ్రిగా తెగ ఫీల్ అయ్యేవాడిని,,
నా ముసలితనం లో
ఇంకా "ఊపిరి" ఆడుతుంటే
బిడ్డగా వాడు ఫీలవుతున్నాడు,,, మా ఆవిడ పురిటి నొప్పులు చూసాక
ఇక ఆవిడను ఇబ్బంది పెట్టదలచుకోలేదు,,,
.........................................
రెండో పెళ్లి చేసుకున్నాను!!!!!!!!!!
నా దేహానికి చొక్కాలు
నా పాదానికి చెప్పులు
ఏమి వేసినా పదిమంది
మేచ్చుకోవాలనే దురద..
అదేమీ చిత్రమో
నాకెప్పుడూ ఈ బట్టలు నేసినవాడిని,
ఈ చెప్పులు కుట్టినవాడిని ,,
కలిసి మెచ్చుకోవాలి అని అనిపించదు?????????
ఆణిముత్యాలు--1
ఇవి నేను ఒక పుస్తకం లో చదివినవి..అందులో కొన్ని నాకు బాగా నచ్చాయి..మీరూ చదువుతారు అని ఇక్కడ రాస్తున్నాను.
దేవుడు ఎంత పక్షపాతి
లేనివాడికి ఇంట్లోకి కూడా ఇవ్వడు
ఉన్నోడికి వొంట్లోకి కుడా ఇస్తాడు
.................షుగరు
ఎన్ని చేపల ఏడుపో..
...........................
సముద్రం లో ని ఉప్పు.
ఒకటే చూసే రెండు కళ్ళు
ఒకదానికి ఒకటి చూస్కోవు
ఎప్పుడు కలిసి ఉండే రెండు పెదాలు
ఒక్క మాట తో విడిపోతాయి
అందుకే..
కళ్ళకి ధ్యానం కావాలి,
పెదాలకి మౌనం కావాలి.
మా ఇంటి చుట్టూ apartments వారికి
కనబడ కూడనివి కనపడుతున్నాయి
మాకు కనపడాల్సిన సూర్యచంద్రులు
కనపడటం మానేశారు...
కుటుంబనియంత్రణ
ఒకరు లేక ఇద్దరు,,,,
...............................
పిల్లలా????? పెళ్ళాలా ???
వీడియోలు తీయాల్సింది
పెళ్లిళ్లకు,పుట్టిన రోజులకు కాదు
సిజేరియన్ లకు
అది చూసైనా కన్నతల్లి కడుపుకోత
తిరగబడే బిడ్డలకు తెలియాలి..
ఒక్క మగాడి హత్య కు
వంద కారణాలు,
వంద ఆడవాళ్ళ హత్యలకు
"కట్నం" ఒక్కటే కారణం..
Subscribe to:
Posts (Atom)


