మొన్న ఈ మధ్యన పెళ్ళిచూపులకు వెళ్ళాను నేను..హవ్వ పెళ్ళయిన మీకు పెళ్లి చూపులేంటి అని అంటారా???నాకు కాదండి,మా అన్నయ్యకు. వెళ్ళాను నేను కూడా..మరి ఆడపడచు కదా ఉండాలి కదా నేను.సరే అనుకున్న మంచి టైం కు వెళ్ళాం వాళ్ల ఇంటికి ..ఇక్కడ విచిత్రం ఏమంటే పెళ్ళికూతురు ఒక అరగంట ముందు చేరింది వాళ్ల ఇంటికి మా కంటే..తనది సాఫ్ట్వేర్ కంపెనీ లో జాబు మరి..hytech సిటీ నుండి dilsukhnagar కు వచ్చేటప్పటికి బస్సు లో నే గంటన్నర పట్టింది ఏం చేస్తుంది మరి..శెలవలు లేవు ట..ఇంక పాపం రెడీ అయ్యే సమయం లేక అలాగే అంటే చుడిదార్ లోనే (అంటే జనరల్ గా చీర కట్టుకుంటారు గా.) వచ్చేసింది మా ముందు కు..పైగా ఇప్పటి fashion ప్రకారం pony tail ..మరి పూలు పెట్టె ప్లేస్ ఏది..చిన్న chain ..చక్కగా సింపుల్ గా మా మధ్యకు వచ్చేసింది..హయిగా అందరం కబుర్లు చెప్పుకున్నాం...పైగా అక్కడ ఉన్న వారిలో ఎక్కువ మండి software engineers నే సో ఇంక జాబు గురించి,,salarys గురించే నడిచాయి ఎక్కువ కబుర్లు...ఏమైనా అడగండి అమ్మాయిని అని అంటారు వాళ్ల అమ్మగారు వాళ్ళు...ఏమడుగుతాం కొత్తగా...ఇదివరకు అంటే నీ పేరు,వంట వొచ్చా,పాటలు వచ్చా అని అడిగేవారు..ఇప్పుడు నీ పేరు ఏంటి,ఏ ఉద్యోగం, అలా అడిగామనుకోండి...ఏ biodata చూడలేదా అని అంటారేమో అని భయం,,వంట సంగతి అంటారా..సరే పెళ్లి అయ్యి ఇన్నేళ్ళయిన మనకు చక్కగా వచ్చా వాళ్ళకు రావటానికి...అయిన ఏముంది ఎవరి ఆఫీసుల్లో వాళ్ళు తినటం...రాత్రి కు ఏదో టిఫిన్ నో ఏదో లాగించేయటం నే గా ఇప్పుడు .పాటలు అంటే ఇప్పుడా కార్యక్రమం ఎందుకులే రోజు టీవీ లలో చూసి చూసి బోర్ కొట్టేసింది అని అనిపిస్తుంది..ఏమడగాలో కూడా అర్ధం కాలేదు..అయిన ఏదో అడిగాం మధ్య మధ్యలోతలా ఒకటి .
సరే ఇలోగా రానే వచ్చాయి మనం ఎదురుచూసే ఫలహారాలు..మరి ఘనం గా ఉండాలి కదా అని పాపం జీడిపప్పు తో చేసిన హాట్..స్వీట్..పెట్టారు..చుస్తే తినాలి అనిపిస్తుంది..కాని హై కాలోరీ...వదిలేస్తే బాగోదు..అలా అని అదేపని గా తింటే బాగోదు...ముందు నుయ్యి వెనక గొయ్యి అలా ఉంటుంది ఆ పరిస్థితి...కబుర్లు చెప్తూ అప్పుడప్పుడు ఒక రెండు పలుకులు అలా నోట్లో వేసుకొని...తిని తిన్నట్టు గా తిన్నాం...కాసేపు అలా గదిలో కెళ్ళి మాట్లాడుకోండి బాబు.మా అమ్మాయి కి కాస్త సిగ్గు ఇక్కడ మాట్లాడాలి అంటే అన్నది వాళ్ల అమ్మగారు,,,అస్సలే బిడియస్తుడు పాపం మా అన్నయ్య.,.సరే మొహమాటానికి అని వెళ్లి కాసేపు మాట్లాడాడు...వీళ్ళ మధ్య ఎస్కార్ట్ లా నేను ఉంటాను అని మాకు ధైర్యాన్ని ఇస్తూ మా బుడతడు మామా నేను వస్తా అని ఫాలో అయ్యాడు వాళ్ళని...మేము ఉన్న చోటనుండి ఆ dilsukhnagar వెళ్ళాలి అంటే గంటన్నర పట్టింది అది కూడా కార్ లో...మరి తిరిగి వెళ్ళాలి అంటే అంతే టైం అవుతుంది కదా...అందుకని వెళ్ళిన అరగంట కే జైహింద్ చెప్పి మళ్ళి బయటపడ్డాం..నాకు ఈ పెళ్ళిచూపులు చుస్తే ఏదో వీకెండ్ లో చుట్టాలింటికి వెళ్లి వచ్చినట్టుంది తప్ప పెళ్ళిచూపులు లా లేదు..ఇప్పుడు tradition అలాగే ఉంది లెండి,,అమ్మాయి కు కూడా మరి భయం గా లేకుండా casual గా ఇలా ఉంటేనే బాగుంటుంది అని అనిపించింది...ఇంటి కి వచ్చాక మా పెళ్ళిచూపులు ఎలా జరిగి నాయి అని గుర్తుతెచ్చుకున్నం నేను మా వారు..అదొక పెద్ద హిస్టరీ ...నెక్స్ట్ పోస్ట్ లో చెబుతా..చాలా traditional గా funny గా జరిగింది మా పెళ్ళిచూపులు..
No comments:
Post a Comment